- Telugu News Photo Gallery Technology photos Huge discount on Samsung galaxy tab s8 tab, Have a look on features and price price details Telugu Tech News
Samsung Galaxy Tab S8: సామ్‌సంగ్ ట్యాబ్‌పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలకిపైగా తగ్గింపు..
ప్రస్తుతం మార్కట్లో ట్యాబ్‌లకు గిరాకీ భారీగా పెరిగింది. ప్రముఖ టెక్ దిగ్గజాలన్నీ తమ బ్రాండ్ నుంచి ట్యాబ్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల క్రితం సామ్‌సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ ఎస్8 పేరుతో మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. అయితే తాజాగా పండుగ సీజన్ నేపథ్యంలో ఈ ట్యాబ్‌పై సామ్‌సంగ్ భారీ డిస్కౌంట్‌ను అందించింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ ఎస్8పై ఏకంగా రూ. 18వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఇంతకీ ఈ ట్యాబ్ ధర ఎంత.? ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి.?
Updated on: Oct 09, 2023 | 9:34 PM

సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల సామ్‌సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ ఎస్8 పేరుతో ఓ ట్యాబ్‌ను లాంచ్ చేసింది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ట్యాబ్ లాంచింగ్ ధర రూ. 66,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 48,99కే సొంతం చేసుకోవచ్చు.

దీంతో పాటు సామ్‌సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ ఎస్8 కొనుగోలు చేసే సమయంలో మరిన్ని డిస్కౌంట్స్ అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 6000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇక నో కాస్ట్ ఈఎమ్‌ఐ ఆప్షన్ ద్వారా కూడా ట్యాబ్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.

ఇక ఈ ట్యాబ్లెట్ ఫీచర్స్ ఫీచర్స్ విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్స్ ప్రైమరీ, 6 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కెమెరాలను అందించారు. ఇక వీడియా కాల్స్ కోసం, సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 8000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక ఈ ట్యాబ్‌లో 11 ఇంచెస్‌తో కూడిన WQXGA డిస్‌ప్లేను అందించారు. 2560×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ట్యాబ్‌తో 4కే హెచ్‌డీతో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. డాల్బీ ఆటమ్స్ క్వాడ్ స్పీకర్స్‌ను ఈ ట్యాబ్‌లో అందించారు.





























