- Telugu News Photo Gallery Technology photos Amazon great indian festival sale Best offers on smartwatches Telugu Tech News
Smart watch: స్మార్ట్ వాచ్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అమెజాన్ సేల్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్ ఉన్నాయి చూశారా.?
దేశంలో దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఈ కామర్స్ సైట్స్ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్స్ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పేరుతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై ఊహకందని డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో తాజా సేల్‌లో స్మార్ట్ వాచ్‌లపై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో ఓ లుక్కేయండి..
Updated on: Oct 10, 2023 | 9:28 PM

OnePlus Nord Watch... ఈ సేల్‌లో లభిస్తోన్న బెస్ట్ డీల్స్‌లో వన్‌ప్లస్ స్మార్ట్ వాచ్ ముందు వరుసలో ఉంటుంది. వన్‌ప్లస్ బ్రాండ్‌కు చెందిన వాచ్‌ను కేవలం రూ. 4వేలలో సొంతం చేసుకునే అవకాశం. వన్‌ప్లస్ నార్డ్ వాచ్ అసలు ధర రూ. 6,999గా ఉండగా సేల్ భాగంగా రూ. 3,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ వాచ్‌లో 1.78 ఇంచెస్ కూడిన అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజులు పనిచేస్తుంది.

Noise ColorFit Ultra 3... అమెజాన్ సేల్‌లో రూ. 3 వేలలోపు లభిస్తోన్న మరో స్మార్ట్ వాచ్ నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా3. ఈ వాచ్ లాంచింగ్ సమయంలో ధర రూ. 8,999గా ఉండగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఏకంగా రూ. 2,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఇక ఈ వాచ్‌లో 1.96 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.

Fire-Boltt Phoenix.. ఫైర్ బోల్ట్ ఫీనిక్స్‌పై కూడా అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసిన సమయంలో దీని ధర రూ. 12,99గా ఉంది. అయితే ప్రస్తుతం ఈ వాచ్‌ను కేవలం రూ. 1,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.43 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. రౌండ్ డయల్‌తో కూడిన ఈ వాచ్‌ను మూడు గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు.

boAt Xtend Plus Smartwatch.. బోట్ కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర లాంచింగ్ సమయంలో రూ. 9,499గా ఉంది. అయితే ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో కేవలం రూ. 1,998కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఇక ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 7 రోజులు పనిచేస్తుంది.

Amazfit Pop 3S Smartwatch.. ఈ సేల్‌లో తక్కువ ధరలో అందుబాటులో లభిస్తున్న స్మార్ట్ వాచ్‌లో అమేజ్‌ఫిట్ పాప్ 3ఎస్ ఒకటి. ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 3,499 కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 2,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు ఏఐ వాయిస్ అసిస్టెన్స్‌ను అందించారు. 100 వాచ్ ఫేస్‌లు, 100 స్పోర్ట్స్ మోడ్‌లు అందిస్తారు.





























