- Telugu News Photo Gallery Spiritual photos Which zodiac signs will benefit from the transit of Rahu and Ketu in the year 2026
2026లో ఊహించని లైఫ్ వీరి సొంతం.. 18 నెలలపాటు స్వర్ణయుగమే!
2026 సంవత్సరం రాబోతుంది. దీంతో చాలా మంది ఈ సంవత్సరం తమకు ఎలా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తమకు ఈ సంవత్సరం కలిసి వస్తుందా? ఏ పని చేసినా అది పూర్తి అవుతుందా? అని ఇలా తమ జాతకం గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కాగా, ఇప్పుడు మనం 2026వ సంవత్సరంలో ఏ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందో తెలుసుకుందాం.
Updated on: Nov 01, 2025 | 7:35 AM

జ్యోతిష్యశాస్త్రం నవ గ్రహాల్లో, రాహు, కేతువులు చాలా కీలకమైనవి. ఇవి శుభ స్థానంలో ఉంటే, శుభప్రదం, అదే నీచ స్థానంలో ఉంటే అనేక సమస్యలు వస్తుంటాయి. అయితే 2026వ సంవత్సరంలో ఈ రెండు గ్రహాలు 12 రాశులను ప్రభావితం చేయనున్నాయంట. ముఖ్యంగా ఇవి మూడు రాశుల వారికి 18 నెలల పాటు, అద్భుతమైన జీవితాన్ని అందివ్వనున్నాయంట. అది ఎలా అంటే?

దుష్ట గ్రహాలు, నీచ గ్రహాలు అయిన, రాహు, కేతువులు రాబోయే సంవత్సరంలో తమ రాశులను మార్చుకోబోతున్నాయంట. ఇవి 2026వ సంవత్సరంలో, రాహు గ్రహం, మకర రాశిలోకి సంచారం చేయగా, కర్కాటక రాశిలోకి కేతు గ్రహం సంచారం చేయనుందంట. ఇవి డిసెంబర్ 5వ తేదీన సంచారం చేయగా, 18 నెలల పాటు అదే రాశిలో ఉండనున్నాయి, దీంతో మూడు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

తుల రాశి : తుల రాశి వారికి రాహువు, కేతువు సంచారం చాలా అద్భుతమైన ప్రయోజనాలను తీసుకొస్తుంది. ఎందుకంటే, వీరికి రాహువు నాల్గొవ ఇంట్లో, కేతవు పదవ ఇంట్లో సంచారం చేయడం వలన జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంట, కొత్త ఆస్తి కొనుగోలు చేయడం, ఉద్యోగం రావడం, అనుకున్న పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుందంట. అంతే కాకుండా , ఈ రాశి వారు ఈ సంవత్సరం తప్పకుండా స్తిరాస్తి కొనుగోలు చేస్తారంట.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి రాహు, కేతువు సంచారం వలన పట్టిందల్లా బంగారమే కానుంది, వీరికి కెరీర్ పరంగ ఉన్న అడ్డంకులు అన్నీ తొలిగిపోతాయి. అంతే కాకుండా అనా రోగ్య సమస్యల నుంచి బయటపడతారు, విపరీతంగా ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

వృషభ రాశి : వృషభ రాశి వారికి రాహు సంచారం వలన, కొత్త వాహనం లేదా స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది, అలాగే కేతు సంచారం వలన చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నింటిని పూర్తి చేసి చాలా ఆనందంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.



