- Telugu News Photo Gallery Spiritual photos The transit of the moon will fulfill the wishes of those belonging to the four zodiac signs
చంద్రుడి చల్లని చూపు.. నేటి నుంచి వీరు కోరుకున్నది ఇట్టే జరిగిపోద్దీ!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది కామన్. అయితే నేడు కార్తీక ఏకాదశి , ఇది చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున ఎవరైతే శైవ క్ష్రేత్రాలను సందర్శించి పూజలు చేస్తారో, వారికి భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుందంట. అంతటి మహోన్నతమైన ఈ రోజున చంద్రుడు సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.
Updated on: Nov 01, 2025 | 3:07 PM

అక్టోబర్ 31న చంద్రుడి సంచారం అద్భుతమైన ఫలితాలనిస్తుంది. అంతే కాకుండా, దీని ప్రభావం వలన నవంబర్ ఒకటొవ తేదీ నుంచి నాలుగు రాశుల వారికి కోరిన కోర్కెలు నెరవేరనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

సింహ రాశి : సింహ రాశి వారికి చంద్రుడి చల్లని చూపు ఉంటుంది. దీని వలన వీరికి అన్ని పనుల్లో కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఏది కోరుకున్నా, అది వెంటనే నెరవేరుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటప సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఈ నెలలో ఈ రాశి వారు ఏది కోరుకున్నా అది వెంటనే నెరవేరుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పట్టిందల్లా బంగారమే కానుంది.

కన్యా రాశి : కన్యారాశి వారికి చాలా రోజుల నుంచి నెరవేరని కోరికల్నీ నెరవేరుతాయి. నిరుద్యోగులకు జాబ్ వచ్చ ఛాన్స్ ఉంది. విద్యార్తులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. ఈ నెలలో ఈ రాశి వారికి ఆదాయం పెరగడంతో చాలా ఆనందంగా గడుపుతారు.

తుల రాశి : తుల రాశి వారికి ఈ మాసం అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఈ రాశి వారు ఈ నెలలో కొత్త వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. వీరు ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అంతే కాకుండా పట్టిందల్లా బంగారమే కానుంది.



