కార్తీక స్నానం అంటే ఏంటి? దీనిని ఎలా చేయడం వలన ఉత్తమ ఫలితాలుంటాయంటే?
కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ గంగానది స్నానం చేస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికంటే ముందుగానే లేచి, నది స్నానం చేస్తారు. దీనిని కార్తీక స్నానం అని కూడా అంటారు. కాగా, కార్తీక స్నానం చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం చూద్దాం.
Updated on: Oct 31, 2025 | 5:19 PM

కార్తీక మాసంలో నది స్నానం చాలా మంచిది. 2025వ సంవత్సరంలో నవంబర్ 5న కార్తీక పౌర్ణమి, ఈ రోజు ఎవరైతే శివకేశవులను ఆరాధిస్తూ, పూజలు జరిపించి, దీపారాధన చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. అంతే కాకుండా, ఈ రోజున ఎవరైతే నది స్నానం చేస్తారో వారికి ఎంతో పుణ్యం లభిస్తుందని చెబుతున్నారు పండితులు.

కార్తీక మాసంలో నది స్నానం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుందంట. ముఖ్యంగా కార్తీ కమాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులు, దిగుడు బావులు, పిల్ల కాలువల్లో నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే చాలా మంది ఈ మాసంలో నది స్నానం చేయడం వలన మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని చెబుతుంటారు. దీని వలన గత జన్మలోని పాపాలన్నీ తొలిగిపోయి పుణ్యం లభిస్తుందంట.

అందుకే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఒక్కరోజైనా, నది స్నానం చేయాలని చెబుతారు పండితులు. ఒక వేళ మీకు కార్తీక మాసంలో నది స్నానం వీలుకాకపోతే, ఇంటిలోనే సూర్యోదయానికి ముందే నిద్రలేచి, చన్నీటితో యమున, గోదావరి, కృష్ణ, కావేరి , నర్మద , తపతి , సింధు మైదలైన నదులను అవాహన చేసుకొని స్నానం ఆచరించాలంట. ఇది కూడా నది స్నానం చేసినంత పుణ్య ఫలాన్ని ఇస్తుందని చెబుతున్నారు పండితులు.

ఇక కార్తీక మాసంలో స్నానం చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయంట. ముఖ్యంగా ఈ మాసంలో చలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యక్తిపై చాలా ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా చీకటి ఎక్కువగా ఉండటం, మానవులలో జీర్ణ శక్తి తగ్గిపోవడం, బద్ధకం పెరగడం జరుగుతుంది, అందుకోసమే ఈ మాసం ప్రారంభంలోనే చల్లటి నీటితో స్నానం చేయడం వలన మన శరీరాన్ని వాతావరణానికి అనుకూలంగా మల్చుకోవడానికి ఉపయోగపడుతుందంట. అందుకే పెద్దవారు ఈ నియమం పెట్టారని చెబుతుంటారు నిపుణులు.

ఇక కార్తీక మాసంలో చన్నీటి స్నానం చేయడం వలన సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉండాటరంట. ఈ రోజున చన్నీటి స్నానం చేయడం భక్తిని, ముక్తిని ఇవ్వడమే కాకుండా, శివుడి అనుగ్రహం కలిగేలా చేస్తుందని చెబతున్నారు నిపుణులు. (నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)



