- Telugu News Photo Gallery Spiritual photos What is the story behind the slogan 'Ganapathi Bappa Morya' on Vinayaka Chavithi?
‘గణపతి బప్పా మోరియా’ అని ఎందుకు అంటారు.? ఈ నినాదం కథ ఏంటి.?
ఈ ఏడాది వినాయక చవితి వేడుకలు ఈ రోజున మొదలయ్యాయి. ఈ తరుణంలో గణేశుని నినాదాల గురించి ఓ ఆసక్తికర విషయం తెలుసుకుందాం. గణపతి బప్పా మోరియా అనే ఈ నినాదం అందరు అనడం, వినడం చేసే ఉంటారు. దీన్ని భాషా, ప్రాంతీయ భేదాల్లేకుండా ప్రతి ఒక్కరు వినాయక మండపంలో నినదిస్తూ ఉంటాము. అసలు ఈ నినాదం వెనక పెద్ద కహానే ఉంది. ఆ కథ ఏంటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం రండి..
Updated on: Aug 27, 2025 | 1:03 PM

15వ శతాబ్దంలో ‘మోరియా గోసాని’ అనే సాధువు మహారాష్ట్రలోని పుణెకు 21 కిలో మీటర్ల దూరంలో చించ్ వాడి అనే గ్రామంలో నివాసం ఉండేవాడు. ఆయన ప్రతి రోజూ గణపతిని పూజించేందుకు చించ్ వాడి నుంచి నడుచుకుంటూ మోరే గావ్ అనే ఊరు వెళ్లేవాడు.

అలా ఓ రోజు నిద్రిస్తూన్న మోరియా కలలో గణనాథుడు కనిపించి.. తాను సమీపంలో ఉన్న నదిలో విగ్రహ రూపంలో ఉన్నానని చెప్పాడట. నిద్రలోంచి లేవగా అది కల అని గ్రహించాడు. ఇక స్వప్నంలో అది కలయో.. నిజమో తెలుసుకోవాలని వినాయకుడు చెప్పిన మాట ప్రకారం మోరియా సమీపంలోని నదిలోకి వెళ్లాడు.

కలలో చెప్పినట్టుగానే ఆ నదిలో ఆ సాధువుకి విఘ్నధిపతి గణేశుడు విగ్రహం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు విఘ్నేశ్వరుడు కలలో కనిపిస్తాని.. మోరియా దర్శనం కోసం ఉన్న ఊరు ఒదలి తండోపతండాలుగా వచ్చారట.

అంతేకాదు గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ పాదాలకు మొక్కి మోరియా అనటం మొదలుపెట్టారు. ఆ నదిలో మహా గణపతిని ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడట గోసావి. మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో బాగమైపోయింది.

అప్పటి నుంచి గజాననుడి పండపల్లో 'గణపతి బప్పా మోరియా' నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది. భక్త వల్లభుడైన గజకర్ణుడు సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్పా మోరియా పూడ్చ వర్సీ లౌకర్ యా.. అని మరాఠీ లో నినదించడం సర్వ సాధారణమైపోయింది. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి.. దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ధ్వారనే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం.అందుకే ‘గణపతి బప్పా మోరియా’ అనే పదం ఇపుడు సర్వ సాధారణమైపోయింది.




