- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: Will drinking water in a steel glass cause problems?
వాస్తు టిప్స్ : స్టీల్ గ్లాస్‌లో వాటర్ తాగుతున్నారా? ఇక మీ జీవితంలో గందరగోళమే!
ఏ ఇంటిలో అయినా సరే ఎక్కువగా స్టీల్ గ్లాస్‌లోనే నీళ్లు తాగుతుంటారు. కానీ ఇలా తాగడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఎందుకంటే? మనం తాగే గ్లాస్ కూడా వాస్తు దోషాలను కలిగిస్తుందని, ముఖ్యంగా ఇలా నీళ్లు తాగడం వలన గ్రహాలు బలహీనపడి అనేక సమస్యలు ఎదురుకానున్నాయంట. కాగా, ఇప్పుడు మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
Updated on: Nov 07, 2025 | 12:25 PM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే వాస్తు నిపుణులు తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి. ఎవరైతే వాస్తు నియమాలు ఉల్లంఘిస్తారో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు పండితులు, అయితే మం రోజూ నీళ్లు తాగే స్టీల్ గ్లాస్ కూడా సమస్యలను తీసుకొస్తుందంట.

వాస్తు శాస్త్రం ప్రకారం, స్టీ్ల్ గ్లాస్‌లో నీళ్లు తాగడం అస్సలే మంచిది కాదంట. ఇది గ్రహాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఇలా టీ గ్లాస్‌లో నీళ్లు తాగడం వలన అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇక ఎవరైతే ఎక్కువగా స్టీల్ గ్లాస్‌లో నీళ్లు తాగుతారో, వారి జాతకంలో రాహువు గ్రహం చాలా బలహీనంగా మారి, అనారోగ్య సమస్యలు, జీవితంలో గందరగోళం ఏర్పడే ఛాన్స్ ఉన్నదంట.

అదే విధంగా స్టీల్ గ్లాస్‌లో ఎవరైతే నీళ్లు తాగుతారో వారు ఎక్కువా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. సమయానికి డబ్బు చేతికి అందకపోవడం, ఖర్చులు అధికం అవ్వడం వంటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అంతే కాకుండా వాస్తు నిపుణుల ప్రకారం, ఎవరైతే తమ ఇంటిలోపల ఎక్కువగా స్టీల్ గ్లాస్‌లో నీటిని తాగుతుంటారో వారి జాతకంలో శుక్ర గ్రహం చాలా ప్రభావితం అవుతుందంట. దీని వలన ఇంటిలోని కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, బంధాలు విచ్చిన్నం అవ్వడం వంటిది జరుగుతుందంట. అందుకే సీసం గ్లాస్ లేదా రాగి గ్లాస్ లో నీరు తాగడం శ్రేయస్కరం.

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)



