- Telugu News Photo Gallery Spiritual photos Has Shani Dosha become a problem? If you do this, you will get relief
శని దోషం సమస్యగా మారిందా.? ఇలా చేస్తే.. ఉపశమనం..
జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడు అంటే చాలా మంది భయపడతారు. జాతకంలో శని దోషం ఉంటె జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని నెమ్మదిగా కదిలే గ్రహం. దీంతో శని దుష్ప్రభావాల వ్యక్తి వల్ల పాటు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కర్మల ఆధారంగా ఫలితాలను అందించే శనిని న్యాయ దేవుడు అని కూడా అంటారు. శని దోషం నివారణకు కొన్ని మార్గాలు, నివారణలు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందామా..
Updated on: Nov 07, 2025 | 3:45 PM

శని దోషం సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు శివుడు, హనుమంతుడిని పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ దోషం నుంచి విముక్తి పొందడానికి శనివారం దేవాలయాలను దర్శించండి. ఈరోజున శని యంత్రంతో పూజ చేస్తే దోషం తొలగిపోతుంది.

శనివారం ఉదయం ఉపవాసం ఉండి శని భగవాన్ ఆలయంలో నెయ్యిలో దీపం వెలిగిస్తే పుణ్యఫలం. లింగ స్వరూపుడు శివునికి స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం, బిల్వపత్రాలతో అర్చన మొదలైనవి చేస్తే శని దోషం తగ్గుతుంది.

శనిదేవునికి ప్రీతికరమైన శనివారం రోజున లేనివారికి, చేతకాని వారికి బంగారం, వస్తు, ఆహారం వంటివి దానం చేస్తే శని బారి నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా శనగపిండి, నెయ్యి, నల్లవస్త్రాలు లాంటివి దానం చేసినట్లయితే మంచి ఫలితాలుం లభిస్తాయి.

శనివారం తెల్లవారుజామున నిద్రలేచి నూనెతో తలస్నానం చేసి భక్తిశ్రద్ధలతో శని మంత్రాన్ని పఠించండి. ఇలా చేస్తే అన్ని రకాల బాధల నుండి విముక్తి పొంది దీర్ఘాయువుతో, మంచి బుద్ధితో, అన్ని చెడులకు దూరంగా జీవిస్తారు.

శని దోషం నివారణ కోసం ప్రతి శనివారం శనిదేవుని ఆలయాన్ని దర్శించాలి. ఈ రోజున శివాలయంలో శివ చాలీసా పాటించడం వల్ల కూడా శని అశుభ ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి 108 సార్లు శని దేవుడిని ధాన్యాన్ని చేయండి.

రోజూ కాకికి పెసరపప్పు దానం చేయండి. ఆలయాల్లో 9 సార్లు నవగ్రహ పూజలు చెయ్యాలి. నీలిరాతి ఉంగరం ధరిస్తే శని దోషం తగ్గుతుంది. శనివారం తెల్లవారుజామున సుందర కాండ పారాయణం వల్ల కూడా శనిగ్రహ దోషం దూరం అవుతుంది.




