- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips for copper sun: These are the benefits of placing in the house
Copper Sun Vastu Tips: అనారోగ్యమా, ఆర్ధిక ఇబ్బందులా.. ఇంట్లో రాగి సూర్యుడిని ఈ దిశలో పెట్టుకోండి..
పురాతన కాలం నుంచి వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. ఈ వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణం తో పాటు ఇంటిలో పెట్టుకునే వస్తువులు వంటి అనేక విషయాలను తెలియజేస్తుంది. కనుక వాస్తు శాస్త్రాన్ని అనుసరించడం వలన జేవితంలో ప్రతికూలత తొలిగి.. సానుకూలత ఏర్పడుతుందని నమ్మకం. ఈ నేపధ్యంలో ఇంట్లో రాగి సూర్యుడిని పెట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఏ దిశలో పెట్టాలి తెలుసుకుందాం..
Updated on: Sep 08, 2025 | 2:52 PM

హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలకు అధినేత అయిన సూర్యుడికి విశేష స్థానం ఉంది. ప్రత్యక్ష దైవంగా సూర్యుడి పూజిస్తారు. అందుకనే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వలన అనేక ప్రయోజనాలు న్నాయని నమ్మకం. శక్తికి, వెలుగుకు ప్రతీకగా భావిస్తారు. రాగి సూర్యుడిని ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అంతేకాదు రాగి సూర్యుడు దుష్టశక్తులను నిరోధించి, ఇంటికి అదృష్టాన్ని తెస్తుందని విశ్వాసం. అంతేకాదు జీవితంలో సానుకూలత కలుగుతుంది. ఇంట్లో రాగి సూర్యుడిని ఉంచుకోవడం వల్ల సూర్య గ్రహం ప్రభావం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటంటే..

బలపడే సూర్య గ్రహం : మీ జాతకంలో సూర్యుడి స్థానం బలపడుతుంది. సానుకూల ప్రభావాలను పెంచుతుంది. మొత్తం శ్రేయస్సు, అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది.

ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది: సూర్యుడు బలం, నాయకత్వానికి చిహ్నం. రాగి సూర్యుడిని ఇంట్లో పెట్టుకోవడం వలన ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి.

మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది: ఇంట్లో రాగి సూర్యుడిని పెట్టుకోవడం వలన మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. భావోద్వేగ స్థిరత్వాన్ని ప్రోత్సహించి.. ఒత్తిడిని మెరుగ్గా నిర్వహించడంలో సహాయపడుతుంది.

కుటుంబ సంబంధాలను మెరుగుపరుస్తుంది: సూర్యుడు కుటుంబ జీవితంలో సామరస్యం నెలకొనేలా చేస్తాడు.

మెరుగైన ఆరోగ్యానికి: ఇంట్లో రాగి సూర్యుడు పెట్టుకోవడం వలన ఇంట్లో సౌరశక్తిని సమతుల్యం చేయడం ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. కొత్త ప్రారంభాలకు ప్రతీక కనుక రాగి సూర్యుడిని తూర్పు ముఖంగా ఉన్న గోడపై ఉంచండి. రాగి సూర్యుడి పవిత్రత, శక్తిని కాపాడేందుకు కంటి స్థాయి కంటే ఎత్తులో, పిల్లలకు అందకుండా ఉంచాలి.

రాగి సూర్యుడిని లివింగ్ రూమ్ లేదా ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకోవడం అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా పరిగణించబడతాయి. ఆదివారం రోజున రాగి సూర్యుడిని పెట్టుకోండి. ఈ రోజు సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు.




