- Telugu News Photo Gallery Spiritual photos Why do people offer coconuts to God? What is the real reason?
దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు.? అసలు కారణం ఏంటి.?
హిందూ సంస్కృతిలో కొబ్బరికాయ కొట్టడం ఒక ప్రాచీనమైన ఆచారం. ప్రతి శుభకార్యంలోను, మన కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ కొబ్బరికాయను భగవంతునికి అర్పించడం చూడవచ్చు. కానీ, ఈ ఆచారం వెనుక ఉన్న అర్థం చాలామందికి తెలియదు. జ్యోతిష్య పండితులు ఈ ఆచారం వెనుక గురించి ఏం అంటున్నారు.? చూద్దాం..
Updated on: Sep 08, 2025 | 7:17 PM

హిందూ సంస్కృతిలో కొబ్బరికాయ కొట్టడం ఒక ప్రాచీనమైన ఆచారం. ప్రతి శుభకార్యంలోను, మన కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ కొబ్బరికాయను భగవంతునికి అర్పించడం చూడవచ్చు. కానీ, ఈ ఆచారం వెనుక ఉన్న అర్థం చాలామందికి తెలియదు.

పండితులు ప్రకారం, కొబ్బరికాయలో ప్రాణశక్తి ఉంటుంది. ఇది జీవనశక్తిని ప్రతిబింబిస్తుంది. ప్లాస్టిక్ వంటి కృత్రిమ వస్తువులలో ఈ ప్రాణశక్తి ఉండదు. అందుకే పూజా కార్యక్రమాల్లో కొబ్బరికాయను ఉపయోగిస్తారు. నిమ్మకాయ, గుమ్మడికాయ వంటి వస్తువులలో కూడా ఈ ప్రాణశక్తి ఉంటుంది. అందుకే అవి కూడా పూజల్లో వాడతారు.

కొబ్బరికాయ కొట్టడం కోరికలు నెరవేరడం పైనే ఆధారపడి ఉండదు. ఇది భగవంతుని పట్ల నమ్మకం, కృతజ్ఞతను ప్రదర్శించే విధానం. కోరిక నెరవేరాలని మొక్కుకున్న వారు, ముందుగానే కొబ్బరికాయ కొట్టాలి.

దేవునిపై నమ్మకం ఉండి, కోరిక తీరిన తర్వాత మొక్కుకున్న సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టడం కృతజ్ఞతా సూచనగా చెప్పుకోవచ్చు. కానీ, కోరిక తీరిన తర్వాతనే కొబ్బరికాయలు కొట్టాలని మొక్కుకోవడం సరైన విధానం కాదు.

దేవునిపై నమ్మకంతో కూడిన భక్తి తో కొబ్బరికాయను కొట్టాలి. అప్పుడు అది నిజమైన పూజగా పరిగణించబడుతుంది. కోరిక నెరవేర్చడం కంటే దేవునిపై నమ్మకం మరియు కృతజ్ఞత అనేది ఎంతో ముఖ్యం అని ఈ వివరణ స్పష్టం చేస్తుంది.




