- Telugu News Photo Gallery Spiritual photos Uttar Pradesh: Here Is A Photo Of The Construction Of The First Floor Of The Ayodhya Ram Mandir
Ayodhya Ram Mandir: అద్భుత శిల్పాకళా వైభవంతో రామ మందిరం.. మొదటి అంతస్థు ఫొటోలు నెట్టింట్లో వైరల్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల కల నెరవేరే సమయం ఆసన్నం అవుతుంది. ఇప్పటికే రామ మందిరం మొదటి అంతస్తు నిర్మాణం తుది దశకు చేరుకుంది. రామాలయం నిర్మాణ పనులను చూపుతున్న నాలుగు చిత్రాలను రామ మందిర నిర్మాణ ట్రస్ట్. సోషల్ మీడియా ఎక్స్ లో షేర్ చేసింది. వచ్చే ఏడాది జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.
Surya Kala | Edited By: TV9 Telugu
Updated on: Dec 28, 2023 | 5:51 PM

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలో రామాలయ మొదటి అంతస్తు నిర్మాణంలో కొనసాగుతున్న ఫోటోను షేర్ చేసింది.

రామాలయం నిర్మాణ పనులను చూపుతున్న నాలుగు చిత్రాలను రామ మందిర నిర్మాణ ట్రస్ట్. సోషల్ మీడియా ఎక్స్ లో షేర్ చేసింది. వచ్చే ఏడాది జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.

గత వారం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, VHP నాయకుడు చంపత్ రాయ్ ఆలయ గర్భగుడికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.

మహామస్తకాభిషేక కార్యక్రమంలో రామమందిరంలోని గర్భగుడిలో రామలల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠనించనున్నారు. అనంతరం భక్తులను అనుమతిస్తారు.

రామజన్మభూమి అయోధ్య ఆలయంలో 4'3'' ఎత్తుతో బాల రాముడి విగ్రహాలను తయారు చేస్తున్నారు.

ముగ్గురు కళాకారులు మూడు వేర్వేరు రాతి ఫలకాలపై విగ్రహాలను మలిచారు. ఈ విగ్రహాలు 90 శాతం పూర్తి అయ్యి.. త్వరలో సిద్ధం అవుతాయని చెబుతున్నారు. ఈ విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు

జనవరి 22న రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి రామ భక్తునికి ప్రతిష్ఠాపన వేడుక ఆహ్వానం ఇప్పటికే వెళ్లింది. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టన కార్యక్రమ ఏర్పాట్లలో హిందూ సంస్థలు నిమగ్నమై ఉన్నాయి.

ప్రధాని మోడీ ఆగస్టు 5, 2020న అయోధ్యలో రామమందిరానికి శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీ మోడీ కూడా దాని లోకర్పణ చేస్తారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో 10 కోట్ల మంది హిందువులు పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు





























