- Telugu News Photo Gallery Spiritual photos The dance of atonement: Men who wear sarees and do garba to undo a 200 year old curse
Dance of Atonement: శాపం నుంచి విముక్తి కోసం.. గత 200 ఏళ్లుగా పురుషులు చీరలు ధరించిన గర్భా. ఎక్కడంటే
Dance of Atonement: దసరా ఉత్సవాల్లో గర్భా అనగానే గుజరాత్ రాష్ట్రం గుర్తుకొస్తుంది. ఇక్కడ నవరాత్రుల్లో గర్బా, డాండియా-రాస్ నృత్యాలతో వేడుకగా జరుపుకుంటారు. అయితే అహ్మదాబాద్‌లోని ఓల్డ్ సిటీలో మాత్రం మగవారు ఆడవారిగా చీరలు ధరించి ప్రాయశ్చిత్తం నృత్యం చేస్తారు. ఇలా గత 200 ఏళ్లుగా ఆచారం కొనసాగుతుంది..
Updated on: Oct 16, 2021 | 2:41 PM

నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజు సాయంత్రం పురుషులు చీరలను ధరించే ఆచారం నిజజీవితంలో కూడా ఉంది. 'సదుబా' అనే మహిళ పెట్టిన శాపం నుండి విముక్తి పొందడానికి ఇలా వేడుకలను నిర్వహిస్తారు.

ఈ ప్రత్యేకమైన గర్బా వేడుకను 'షెరీ గర్బా' అని పిలుస్తారు. బరోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు చీరలు ధరించి నవరాత్రుల్లో ఎనిమిదో రోజు రాత్రి సాదు మాతా పూజిస్తూ.. నృత్యం చేస్తారు.

తమపై ఓ మంత్రగత్తె దాడి చేస్తుందనే భయంతో చీరలను ధరించిన పురుషులు ఇంటినుంచి ఉత్సవానికి బయలుదేరే సమయంలో ముఖాన్ని కప్పుకుంటారు. సదుబా అనే మహిళకు 200 ఏళ్ల క్రితం జరిగిన అన్యాయానికి ఇక్కడివారు ఇంకా ప్రాయశ్చితం చేసుకుంటున్నారు. అందుకనే దసరాకు అహ్మదాబాద్‌లోని ఓల్డ్ సిటీలో పురుషులు దేవతను సంతృప్తి పరచడానికి చీరలను ధరిస్తారు

నృత్యానికి ముందు తన భర్త చీరను ధరించడానికి సహాయం చేస్తున్న భార్య

ఈ సంప్రదాయం ఈ ప్రాంతంలో నివసించిన 'సదుబా' అనే మహిళ పెట్టిన శాపం నుంచి తమ వంశాన్ని రక్షించుకోవడానికి దాదాపు 200 సంవత్సరాల క్రితం ప్రారంభించినట్లు భావిస్తున్నారు. ఇక్కడ సదుబాకు దేవాలయం కూడా ఉంది. నవరాత్రుల్లో ఎనిమిదో రోజున సాయంత్రం ఆలయానికి వెళ్లి పురుషులు సదుబాని ప్రార్థిస్తాఋ. తమని మన్నించమని కోరతారు.

తమ సంతానం ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుగా జీవించడానికి పురుషులు ఇలా స్త్రీ వేషధారణలో నృత్యం చేస్తారని స్థానికులు చెబుతున్నారు. చాలా సంవత్సరాల క్రితం సదుబా, లేదా సాదుబెన్ తన గౌరవానికి భంగం కలిగినప్పుడు ఆ ప్రాంతంలోని పురుషులకు శాపం ఇచ్చిందని కథనం. ఆమె కోపాన్ని తగ్గించి శాంతిగా ఉండేలా చేయడం కోసం ఈరోజుని ముఖ్యమైనదిగా భావిస్తారు. అంతేకాదు.. గత కొన్ని సంవత్సరాలుగా తమ పిల్లలను కాపాడుతున్న సదుబాకు కృతఙ్ఞతలు చెబుతున్నారు.




