- Telugu News Photo Gallery Spiritual photos Spiritual Remember these four rules before wearing Rudraksha
Rules for Rudraksha: రుద్రాక్ష ధరిస్తున్నారా? అయితే, ఈ నియమాలను ఖచ్చితంగా పాటించండి.. లేదంటే..
Rules for Rudraksha: రుద్రాక్ష శివుని కన్నీటి నుండి ఉద్భవించిందని చెబుతారు. దీనిని ధరించిన వారిపై శివునికి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. అయితే, దీనిని ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని ఎప్పుడూ పాటించాలి.
Updated on: Nov 25, 2021 | 6:24 AM

నల్ల దారంలో రుద్రాక్షను ధరించడాన్ని చాలా మందిని చూసి ఉంటారు. కానీ ఎప్పుడూ అలాంటి పొరపాటు చేయకూడదు. ఎరుపు లేదా పసుపు దారంతో రుద్రాక్షను ధరించాలి. మరిచిపోయి కూడా నల్ల దారంతో ఉన్న రుద్రాక్షను ధరించొద్దు.

రుద్రాక్ష శివునికి సంబంధించినది. దానిని తాకేటప్పుడు శుభ్రత పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. స్నానం చేసిన తర్వాత మాత్రమే ధరించాలి. దాంతో పాటు, రుద్రాక్ష ధరించేటప్పుడు ఖచ్చితంగా ఓం నమః శివాయ మంత్రాన్ని మనస్సులో జపించాలి.

వేరొకరు ధరించే రుద్రాక్షను ఎప్పుడూ ధరించవద్దు. లేదా ఇతరులెవరికీ మీ రుద్రాక్షను ఇవ్వొద్దు. రుద్రాక్ష హారాన్ని తయారు చేసేటప్పుడు అందులో కనీసం 27 పూసలు ఉండాలని గుర్తుంచుకోండి.

దారం కాకుండా.. మీరు వెండి లేదా బంగారంలో పొదిగించడం ద్వారా రుద్రాక్షను కూడా ధరించవచ్చు. అయితే, ఒక దండను తయారు చేస్తే, అందులో రుద్రాక్షలు బేసి సంఖ్యలలో ఉండాలి.




