Vastu Tips: ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, ఆనందం పెరగాలంటే.. ఈ 5 విషయాలను తప్పక గుర్తుంచుకోండి..
Shiva Prajapati |
Updated on: Nov 25, 2021 | 6:22 AM
Vastu Tips: ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి కొన్ని విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివిటీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది.
Nov 25, 2021 | 6:22 AM
గోడ గడియారాలు ఎల్లప్పుడూ పనిచేస్తుండాలి. పని చేయని వాటిని ఇంట్లో నుంచి పడేయాలి. గోడ గడియారాలను ఇంటి తూర్పు, పడమర, ఉత్తరం వైపు గోడకు పెట్టుకోవాలి. ఈ దిశలో గోడ గడియారాన్ని ఉంచడం కొత్త అవకాశాలను పొందడంలో సహాయపడుతుంది. ఎటువంటి సమస్య లేకుండా పని చేయడంలో సహాయపడుతుంది. అయితే, ఆకుపచ్చ రంగు గోడ గడియారాలను ఇంట్లో పెట్టొద్దు. అవి అవకాశాలను దెబ్బతీస్తాయి.
1 / 5
ఇంటి నేమ్‌ప్లేట్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. మెరిసే నేమ్‌ప్లేట్ అవకాశాలను ఆకర్షిస్తుంది. ఇది ఇంట్లో నివసించే వ్యక్తి జీవనశైలిని కూడా నిర్వచిస్తుంది.
2 / 5
దక్షిణ, పడమర గోడల వెంట భారీ ఫర్నిచర్ ఉంచండి. అయితే తేలికపాటి ఫర్నిచర్ ఉత్తర, తూర్పు గోడల వైపునే ఉంచాలి. ప్లాస్టిక్ ఫర్నీచర్ వంటి హానికరమైన వాయువులను విడుదల చేయని కారణంగా చెక్క ఫర్నిచర్‌ను ఎక్కువగా ఉపయోగించేందుకు ప్రయత్నించండి. మెటల్ ఫర్నిచర్ కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి మన చుట్టూ విద్యుదయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. ఇది ప్రతికూలతను పెంచుతుంది.
3 / 5
ఇంటి ముఖద్వారం వద్ద తులసి మొక్కను నాటండి. తులసి మొక్క విష్ణు భగవానుడికి సంబంధించింది. దానిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇది నెగిటీవ్ ఎనర్జీని గ్రహిస్తుంది. అదే సమయంలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. తులసి మొక్కను ఎల్లప్పుడూ తూర్పు దిశలో ఉంచాలి. లేదంటే.. ఉత్తరం, ఈశాన్యం దిశలో కిటికీ దగ్గర కూడా ఉంచవచ్చు.
4 / 5
ఇంటి ప్రవేశ ద్వారం వద్ద షూ స్టాండ్ పెట్టవద్దు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని మాత్రమే ఆకర్షిస్తుంది. షూ రాక్ ఉంచడానికి పశ్చిమ, నైరుతి మూల ఉత్తమం. అయితే, ఉత్తర, ఆగ్నేయం, తూర్పు దిశలలో అస్సలు షూ స్టాండ్ పెట్టకూడదు.