AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్ర గ్రహణ ప్రభావం.. వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారం..! మీ రాశికి ఎలా ఉండబోతోంది?

Total Lunar Eclipse 2025: ఈ నెల (సెప్టెంబర్) 7వ తేదీ రాత్రి సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. ఇది భారతదేశంలో భాద్రపద పౌర్ణమి, ఆదివారం నాడు శతబిషం, పూర్వాభాద్ర నక్షత్రాల్లో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడుతోంది. రాత్రి 9.56కు ప్రారంభమయ్యే అర్ధరాత్రి 1.26 గంటలకు వదిలిపెడుతుంది. కుంభ, మీన రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, దీని ప్రభావం మాత్రం దాదాపు అన్ని రాశుల మీదా ఉంటుంది. ఈ గ్రహణం కుంభ రాశిలో కలిసే చంద్ర, రాహువులతో బుధుడు కూడా కలిసి ఉన్నందువల్ల ఈ గ్రహణం తాలూకు చెడు ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు. గ్రహణం పట్టేది రెండు గంటలే అయినప్పటికీ, దీని ప్రభావం మాత్రం రెండు రోజులు (7, 8 తేదీలు) ఉంటుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 01, 2025 | 8:15 PM

Share
మేషం: ఈ రాశిలోని 11వ స్థానంలోని శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రాల్లో చంద్ర గ్రహణం ఏర్పడుతున్నందువల్ల ఈ రాశికి ఎక్కువగా శుభాలే కలిగే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది. మానసిక, శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. మంత్ర జపం చేసుకోవడం మంచిది.

1 / 12
వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా మందకొడిగా సాగుతాయి. ఆ రెండు రోజులు ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. పేరు ప్రఖ్యాతులు దెబ్బతినే అవకాశం ఉంది. అనవసర వ్యయానికి అవకాశం ఉంది. డబ్బు నష్టపోవడం జరుగుతుంది. సుందరకాండ పారాయణం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుంది.

2 / 12
మిథునం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో గ్రహణం పడుతున్నందువల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఈ రాశివారి మీద గ్రహణ ప్రభావం ఉండకపోవచ్చు. అయితే, రోజంతా యథాతథ స్థితిని కొనసాగించడం మంచిది. కొత్తగా ఆదాయ ప్రయత్నాలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా ఒప్పందాల మీద సంతకాలు చేయడానికి ఇది అనుకూల సమయం. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. విష్ణు సహస్ర నామం చదువుకోవడం చాలా మంచిది.

3 / 12
కర్కాటకం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో గ్రహణం పట్టడం వల్ల, చంద్రుడు రాశినాథుడు కావడం వల్ల గ్రహణ దోషం బాగా ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అధికారులతో ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే సూచనలున్నాయి. ఆర్థికంగా బాగా నష్టపోయే అవకాశం ఉంది. పేరు ప్రతిష్ఠలు దెబ్బతినే అవకాశం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆదిత్య హృదయం పఠించడం ఉత్తమం.

4 / 12
సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల కొన్ని సదవకాశాలను చేజార్చుకునే అవకాశం ఉంది. విదేశాల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి ఆశించిన శుభవార్త అందకపో వచ్చు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో సానుకూల స్పందన లభించకపోవచ్చు. కొత్త ప్రయత్నాలు చేపట్టకపోవడం, కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. ముఖ్యమైన వ్యవ హారాల్లో ఇబ్బందులు కలుగుతాయి. దుర్గా స్తోత్రం చదువుకోవడం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుంది.

5 / 12
కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల అనారోగ్యాల నుంచి  ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. వారసత్వపు ఆస్తి చేతికి అందుతుంది. ధ్యానం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుంది. అయితే, ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం పెట్టుకోవద్దు.

6 / 12
తుల: ఈ రాశివారికి పంచమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించడం, అప్రమత్తంగా ఉండడం మంచిది. మానసిక స్థయిర్యం తగ్గుతుంది. ఎంత ప్రయత్నించినా అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవచ్చు. జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త ప్రయత్నాలు చేయవద్దు. ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిది.

7 / 12
వృశ్చికం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో గ్రహణం సంభవిస్తున్నందువల్ల స్వల్ప అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. కుటుంబ జీవితం కొద్దిగా అస్తవ్యస్తం అవుతుంది. శత్రు బాధ, పోటీదార్ల బాధ తగ్గుతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయ వృద్ధికి కొత్తగా ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు యథావిధిగా సాగిపోతాయి. ఆస్తి వివాదాలు ఇబ్బంది పెడతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం చాలా మంచిది.

8 / 12
ధనుస్సు: ఈ రాశివారికి తృతీయ స్థానంలో గ్రహణం పట్టడం వల్ల ఆదాయం వృద్ధి చెందడం, ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి ఇది అనుకూల సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. గణపతి స్తోత్రం పఠించడం మంచిది.

9 / 12
మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో గ్రహణం సంభవిస్తున్నందువల్ల కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన సమస్యలు ఏర్పడవచ్చు. కొత్త ప్రయత్నాలు చేపట్టవద్దు. ప్రయాణాలు పెట్టుకోవద్దు. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. యథాతధ స్థితిని కొనసాగించడం మంచిది. ఆదిత్య హృదయం పఠించడం వల్ల దోష నివారణ జరుగుతుంది.

10 / 12
కుంభం: ఈ రాశిలో గ్రహణం సంభవించడం వల్ల ఈ రాశివారిని కొద్దిగా అనారోగ్యాలు పీడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా తగ్గే అవకాశం ఉంది. పొగడిన వారే తెగడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. బంధువుల నుంచి ఒకటి రెండు దుర్వార్తలు వింటారు. ప్రయాణాల వల్ల ఇబ్బందులు పడతారు. అనవసర స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

11 / 12
మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల ప్రస్తుతానికి ధన వ్యవహారాలకు, లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా బాగా నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో యథాతథ స్థితిని కొనసాగించడం శ్రేయస్కరం. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు మాటల వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇష్ట దైవాన్ని మరింత శ్రద్ధగా ధ్యానించడం మంచిది.

12 / 12