- Telugu News Photo Gallery Spiritual photos Navratri 2025: Seeing These things in dreams during Navratri Auspicious Symbols
Swapna Shastra: నవరాత్రి సమయంలో ఈ 9 కలలు చూస్తే.. మీపై అమ్మ దయ ఉన్నట్లే.. స్వర్ణకాలం ప్రారంభం
నిద్రపోతున్న సమయంలో కలలు కనడం చాలా సర్వ సాధారణం. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు భవిష్యత్తు గురించి రానున్న శుభ లేదా అశుభ సంకేతాలను అందిస్తాయి. నవరాత్రి పవిత్ర సమయం ప్రారంభమైంది. ఈ సమయంలో కలలలో కొన్ని విషయాలను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ తొమ్మిది రకాల కలలు వస్తే.. అమ్మ దయతో వారికి స్వర్ణకాలం ప్రారంభమైనట్లు అర్ధం చేసుకోవాలట.
Updated on: Sep 23, 2025 | 11:05 AM

హిందువులు ఘనంగా జరుపుకునే శారదీయ నవరాత్రి వేడుకలను ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 2న ముగుస్తాయి. ఈ నవరాత్రి తొమ్మిది రోజులలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. ఉపవాసం ఉంటారు. నవరాత్రి సమయంలో వచ్చే కలల్లో కొన్ని కలలు శుభప్రదం అట. చాలా ప్రయోజనకరంగా, అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడే కొన్ని కలలు ఉన్నట్లు స్వప్న శాస్త్రం తెలియజేస్తుంది. నవరాత్రి సమయంలో కలలలో వేటిని చూస్తే శుభప్రదంగా పరిగణించబడుతుందో ఈ రోజు తెలుసుకుందాం..

సింహాన్ని కలలో చూడటం: నవరాత్రి సమయంలో కలలో సింహాన్ని చూడటం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం నవరాత్రి సమయంలో కలలో సింహాన్ని చూడటం దుర్గాదేవి ఆశీస్సులు మీ పై ఉన్నట్లు. అంతేకాదు దుర్గమ్మ దయతో శత్రువులపై విజయం, ఆర్థిక లాభం, వృత్తిపరమైన పురోగతిని సూచిస్తుంది.

కలలో దుర్గాదేవిని చూడటం: స్వప్న శాస్త్రం ప్రకారం కలలో దుర్గాదేవిని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అమ్మవారు నవ్వుతూ కనిపిస్తే భవిష్యత్తులో ఆనందం, శ్రేయస్సు, విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

కలలో అమ్మాయి కనిపిస్తే: నవరాత్రి సమయంలో కలలో అమ్మాయిని చూడటం చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కల దుర్గాదేవి ఆశీర్వాదాన్ని, సంపద , శ్రేయస్సు రాకను సూచిస్తుంది. ముఖ్యంగా అమ్మాయి నవ్వుతూ లేదా శుభ్రమైన బట్టలు ధరించి ఉంటే ఆ కల అత్యంత శుభప్రదం అట.

కలలో దీపం కనిపిస్తే: నవరాత్రి సమయంలో ఎవరి కలలోనైనా వెలుగుతున్న దీపం కనిపిస్తే ఆ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నవరాత్రి సమయంలో వెలుగుతున్న దీపం కలలో కనిపిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం.

కలలో లక్ష్మీదేవి కనిపిస్తే: నవరాత్రి సమయంలో కలలో లక్ష్మీదేవిని చూసినట్లయితే.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోబోతున్నాయని, త్వరలో ఆర్థిక లాభం పొందవచ్చని అర్థం మట. కలలో లక్ష్మీదేవిని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

పూజ చేస్తున్నట్లు కలలు కంటే: నవరాత్రి తొమ్మిది రోజులలో పూజ చేస్తున్నట్లు కలలు కన్నట్లయితే.. వారి కెరీర్, వ్యాపారం త్వరలో అభివృద్ధి చెందుతాయని అర్థం. అంతేకాదు ఏదైనా పని పెండింగ్ లో ఉంటే ఆ పని కూడా పూర్తవుతుంది.

పార్వతి దేవిని కలలో చూస్తే: నవరాత్రి సమయంలో పార్వతి దేవిని కలలో చూడటం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. నవరాత్రి సమయంలో పార్వతి దేవిని కలలో చూడటం ఉద్యోగం చేసేవారికి, వ్యాపారం రంగంలో ఉన్నవారి లాభానికి సంకేతంగా పరిగణించబడుతుంది.

కలలో దుర్గాదేవి ఆలయాన్ని చూస్తే: నవరాత్రి సమయంలో కలలో దుర్గాదేవి ఆలయాన్ని చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో అమ్మవారి ఆలయాన్ని చూడటం కుబేరుని ఆశీస్సులు మీ ఫై ఉంటాయని.. ఆర్థిక సమస్యల పరిష్కారం కానున్నాయని సంకేతం.

కలలో కమలం పువ్వు కనిపిస్తే: హిందూ మతంలో తామరపువ్వు లక్ష్మీదేవి , దుర్గాదేవి ఇద్దరితోనూ ముడిపడి ఉంటుంది. నవరాత్రి సమయంలో కలలో కమలం పువ్వు కనిపించడం ఆర్థిక లాభం, శ్రేయస్సు , అదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది.




