- Telugu News Photo gallery Spiritual photos Lord Shiva: form of mahadev is full of mystery , Beyond the Popular mythological stories
Lord Shiva: పురాణాల ప్రకారం లయకారుడైన శివతత్వం.. సృష్టి రహస్యం ఏమిటో తెలుసా..
హిందూ సంప్రదాయంలో సోమవారం శివునికి అంకితం చేయబడిన రోజు. సోమవారం శివయ్యను భక్తి శ్రద్దలతో పూజిస్తే కోరిన కోర్కెలు తీరతాయని విశ్వాసం. లయకారుడైన శివ స్వరూపం రహస్యాలు ఉన్నాయి. పౌరాణిక కథలు కూడా ఉన్నాయి.
Updated on: Jul 27, 2023 | 3:02 PM

హిందువుల విశ్వాసం ప్రకారం శ్రావణ మాసంలో శివయ్యను పూజిస్తే భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తాడు. లయకారుడైన శివుడు కోరిన కోర్కెలను తీర్చే బోళాశంకరుడు. అది దేవతలు లేదా అసురులు కావచ్చు, తీవ్రమైన తపస్సు చేస్తే చాలు కోరిన ప్రతిదీ ప్రసాదిస్తాడు. ఎలాంటి భేదం లేకుండా అనుగ్రహిస్తాడు. శివుని రూపానికి కూడా అద్భుతమైన మహిమ ఉంది.

గంగా దేవి: శివుని శిగలో గంగా దేవి కొలువై ఉంటుంది. పురాణాల ప్రకారం అమృతం కోసం సముద్ర మథనం సమయంలో తన గొంతులో విషాన్ని దాచుకున్నాడు. అలా గొంతులో మండుతున్న విషాన్ని శాంతపరచడానికి గంగను నెత్తిమీద పెట్టుకున్నాడని పురాణాల కథం. అంతేకాదు.. మహాదేవుని రుద్ర రూపాన్ని శాంతపరచడానికి కూడా గంగ సహాయం చేస్తుంది.


పులి చర్మం: మహాదేవుడు పులి చర్మాన్ని ధరిస్తాడు. పులి చర్మంపై ఆసీనుడై ఉంటాడు. ఇలా స్వామి పులిచర్మంపై కూర్చున్నా, పులి చర్మాన్ని ధరించినా.. శివయ్య సర్వోత్కష్టమైన కాల స్వరూపుడని చెప్పడమే.

నాగ దేవత: మహాదేవుని మెడలో నగలుగా సర్పం అలంకరింపబడి ఉంటుంది. నాగేంద్రుడు సదా శివుడి సన్నిధిలో కొలువై ఉంటాడు. నాగేంద్రుడిని పురుష గర్వానికి ప్రతీకగా భావిస్తారు.

రుద్రాక్ష: మహాదేవుని చేతులు, మణికట్టు, మెడలో రుద్రాక్ష మాలలు కనిపిస్తాయి. రుద్రాక్షకు నిజమైన అర్థం స్వచ్ఛతకు చిహ్నం. రుద్రాక్షమాల కూడా సాధారణంగా ధ్యానముద్రకు చిహ్నం.

త్రినేత్రుడు: మహాదేవుడిని త్రినేతుడు అని కూడా అంటారు. కుడి కన్నులో సూర్యుని ప్రకాశం.. ఎడమ కన్నులో చంద్రుని చల్లదనం. నుదిటిపై ఉన్న మూడవ కన్ను అగ్ని జ్వాలని కలిగి ఉంటుంది, ఇది చెడును నియంత్రించగలదు.

Lord Shiva





























