IND vs ENG: గంభీర్‌కు మొదలైన తలనొప్పి.. ఇంగ్లండ్ పర్యటనకు ముందే ఆ ఇద్దరితో టెన్షన్.. ఎందుకంటే?
IND vs ENG: ఇద్దరు సీనియర్ ఆటగాళ్ళు మాత్రం ఈ విషయంలో తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ఈ వైఫల్యం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ టెన్షన్‌ను మరింత పెంచింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీల ప్రదర్శన ఆశాజనకంగా లేదు.

Gautam Gambhir: భారత ఆటగాళ్ళు ఐపీఎల్ 18వ సీజన్‌లో బిజీగా ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా ఆటగాళ్లకు అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇంగ్లాండ్ పర్యటనలో సెలక్ట్ అయ్యేందుకు అత్యుత్తమ ఆటతో ఆకట్టుకోవాలని చూస్తున్నారు. కానీ, ఇద్దరు సీనియర్ ఆటగాళ్ళు మాత్రం ఈ విషయంలో తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ఈ వైఫల్యం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ టెన్షన్‌ను మరింత పెంచింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీల ప్రదర్శన ఆశాజనకంగా లేదు.
రోహిత్ శర్మ విఫలం..
భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ జూన్ 20న జరగనుంది. ఇందులో రోహిత్ శర్మ కెప్టెన్‌గా కనిపించవచ్చు. కానీ, ఈ మ్యాచ్‌కు ముందు హిట్‌మ్యాన్ ప్రదర్శన నిరాశ పరుస్తోంది. ఎందుకంటే, అతను ఐపీఎల్‌లో ముంబై జట్టు తరపున ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో 7 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్ 26 సగటుతో 158 పరుగులు మాత్రమే చేశాడు. మొదటి 2 మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయాడు.
వికెట్ల వేటలో మహ్మద్ షమీ నిరాశ..
ఈ జాబితాలో రెండవ పేరు టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ. మోకాలి శస్త్రచికిత్స తర్వాత, షమీ పూర్తి ఫామ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు. షమీ బౌలింగ్‌లో ఎటువంటి మార్పు లేదు. అనుభవం లేని బ్యాట్స్‌మెన్స్ సైతం షమీ బంతుల్లో చాలా సులభంగా ఫోర్లు, సిక్సర్లు కొడుతున్నారు. షమీ ఐపీఎల్‌లో SRH జట్టులో ఒక భాగంగా ఉన్నాడు. అతను 7 మ్యాచ్‌ల్లో కేవలం 5 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఈ క్రమంలో చాలా ఖరీదైనదిగా నిరూపించుకున్నాడు. ఇటువంటి పరిస్థితిలో, గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్ పర్యటనలో షమీని చేర్చుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








