AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs SRH: 8 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 3వ విజయం కోసం చెన్నై, హైదరాబాద్ పోరు

CSK vs SRH Preview and Prediction: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆధిక్యంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య దాదాపు ఏకపక్ష పోరాటం జరిగింది. ఇప్పటివరకు ఆడిన 21 మ్యాచ్‌ల్లో చెన్నై 15 సార్లు గెలిచింది. హైదరాబాద్ 6 సార్లు మాత్రమే గెలిచింది. అయితే, గత ఐదు మ్యాచ్‌లలో కఠినమైన పోటీ నెలకొంది. కానీ, ఇక్కడ కూడా చెన్నై 3-2 ఆధిక్యంలో ఉంది.

CSK vs SRH: 8 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 3వ విజయం కోసం చెన్నై, హైదరాబాద్ పోరు
Csk Vssrh Preview
Venkata Chari
|

Updated on: Apr 25, 2025 | 8:07 AM

Share

CSK vs SRH Preview and Prediction: ఐపీఎల్ (IPL) 2025 లో ప్లేఆఫ్ రేసు చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటివరకు, చాలా జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. కానీ, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి ఛాంపియన్ జట్లు తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. ఈ రెండు జట్లు టాప్ 4 రేసు నుంచి బయటపడనున్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఏప్రిల్ 25న జరిగే మ్యాచ్ ఇరుజట్లకు ఎంతో కీలకమైనది. శుక్రవారం చెన్నైలోని చేపాక్ స్టేడియంలో చెన్నై వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా, రెండు జట్లు ప్లేఆఫ్ రేసులో తమను తాము కాపాడుకోవాలని చూస్తున్నాయి. అయితే, ఇందుకోసం ఇరుజట్లు 100 శాతం పోరాడేందుకు సిద్ధమయ్యాయి.

చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండూ పాయింట్ల పట్టికలో పేలవమైన స్థితిలో ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు తలో 8 మ్యాచ్‌లు ఆడి కేవలం చెరో 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచాయి. దీంతో ఇరుజట్లకు తలో 4 పాయింట్లు ఉన్నాయి. కానీ, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా, పాట్ కమ్మిన్స్ జట్టు తొమ్మిదవ స్థానంలో, ఎంఎస్ ధోని జట్టు పదో స్థానంలో ఉన్నాయి. హైదరాబాద్ తన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలవగా , చెన్నై కూడా ముంబైతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇప్పుడు ఈ రెండు జట్లు విజయం కోసం పోరాడుతున్నాయి.

IPLలో CSK vs SRH హెడ్ టు హెడ్ గణాంకాలు..

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆధిక్యంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య దాదాపు ఏకపక్ష పోరాటం జరిగింది. ఇప్పటివరకు ఆడిన 21 మ్యాచ్‌ల్లో చెన్నై 15 సార్లు గెలిచింది. హైదరాబాద్ 6 సార్లు మాత్రమే గెలిచింది. అయితే, గత ఐదు మ్యాచ్‌లలో కఠినమైన పోటీ నెలకొంది. కానీ, ఇక్కడ కూడా చెన్నై 3-2 ఆధిక్యంలో ఉంది.

ఇవి కూడా చదవండి

CSK vs SRH మ్యాచ్‌లో ఎవరు గెలవగలరు?

రెండు జట్లు పేలవంగా తయారయ్యాయి. ఐపీఎల్ 2025లో భాగంగా 43వ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో చెప్పడం కొంచెం కష్టం. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరెట్‌గా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం సొంత మైదానంలోని పరిస్థితులే. దీని నుంచి చెన్నై ప్రయోజనం పొందవచ్చు. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమైందని నిరూపించుకుంటోంది. ఈ కారణంగా చెన్నైపై గెలిచే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..