కావ్యపాపకు ఆఫర్స్ కరువయ్యాయే..  ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..

Rajeev 

24 April 2025

Credit: Instagram

కావ్య థాపర్.. మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత నటిగా మారింది.  ప్రధానంగా తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో నటిస్తుంది. 

ఈ అందాల భామ 1995 ఆగస్టు 20న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. కావ్య తన నటనా జీవితాన్ని హిందీ సినిమాతో మొదలుపెట్టింది. 

2013లో హిందీ లఘు చిత్రం "తత్కాల్"తో ప్రారంభించింది. ఆమె పటంజలి, మేక్ మై ట్రిప్, కోహినూర్ వంటి పలు ప్రముఖ బ్రాండ్‌ల ప్రకటనలలో కనిపించింది.

2018లో "ఈ మాయ పేరేమిటో" చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. 2021లో "ఏక్ మినీ కథ" చిత్రంలో అమృత పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందింది.

కావ్య తన సహజమైన నటన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతమా చేసుకుంది. 

తెలుగులో ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసినప్పటికీ భారీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. 

ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.