Indrakeeladri: శరన్నవరాత్రులకు ముస్తాబైన దుర్గగుడి.. ఈ నెల 15 నుండి జరగనున్న ఉత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్ద పీట

అమ్మలు గన్న అమ్మ..ముగ్గురమ్మల మూలపుటమ్మ.. కనకదుర్గమ్మను కొలిచేందుకు మనసంతా భక్తి భావంతో వచ్చే భక్తులు మెచ్చుకునే విధంగా శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవాలకు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులు భక్తి పారవశ్యంలో తేలియాడేలా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వెలుగు పూలవానలో మైమరిచేలా.. తన్మయంతో కనక దుర్గమ్మ తల్లి పుణ్య క్షేత్రంలో భక్త జనకోటి పరవశించేలా.. దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షించుకుంటూ, భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు...

M Sivakumar

| Edited By: Surya Kala

Updated on: Oct 13, 2023 | 1:03 PM

ఈ నెల 15వ తేదీ నుండి ఇంద్రకీలాద్రిపై నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాల కోసం విస్తృత ఏర్పాటు జరుగుతున్నాయి. క్యూ లైన్లు, పారిశుధ్యం, కేశఖండనశాల, స్నానాల గదులు, ప్రసాదాలు ఇలా అన్నింటి పైన అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూ లైన్లు గుండా వెళ్లేందుకు ఇటు వినాయకుడు అటు కుమ్మరిపాలెం వైపు నుండి ప్రత్యేక క్యూ లైన్ లను ఫుట్పాట్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు.

1 / 7
భక్తులకు కొండ పైకి వచ్చేందుకు వీలుగా ఈ ఏడాది రెండు ఫుట్ పాత్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. దర్శనమనంతరం భక్తులు మహా మండపం, మల్లేశ్వర స్వామి వారి ఆలయ మెట్ల మార్గం ద్వారా కొండ దిగుకు వెళ్లే ఏర్పాటు చేస్తున్నారు.

2 / 7

వచ్చే భక్తులకు అపూర్వ స్వాగతం పలికేందుకు స్వాగత ద్వారాలు సైతం ఎక్కడికి అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే భక్తులు స్నానాలు చేసుకునేందుకు వీలుగా ఘాట్ వద్ద 710 షవర్లను సైతం ఏర్పాటు చేశారు. దుస్తులనుచేసి 24 గంటలు పనులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటు భక్తుల భద్రతకు పెద్దపేట వేస్తున్నారు..

3 / 7
లక్షల సంఖ్యలో శరన్నవరాత్రి 9 రోజులు వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు అందుకు నగరంలో లడ్డుకౌంటులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. వృద్ధులు, వికలాంగులు అమ్మవారి దర్శనానికి వచ్చే వారికోసం ఈ ఏడాది బ్యాటరీ కార్ల స్థానంలో డీజిల్ వాహనాలను వినియోగించనున్నారు. శరన్నవరాత్రి ఉత్సవ వేడుకల కోసం ఇంద్ర ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటుంది.

4 / 7
ఇప్పటికే ప్రధాన ఆలయంతో పాటూ, గాలిగోపురం, ఉప ఆలయాలు ఇలా అన్ని ప్రదేశాలను సరికొత్త రంగులను అద్దారు. అలాగే ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజులపాటు మెరుమెట్ల గోలిపే విద్యుత్ దీప కాంతుల కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి..

5 / 7
ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించే దిశగా అధికారులు విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. గంట నుండి గంటన్నర వ్యవధి లోపలే అమ్మవారి దర్శనాన్ని అందించే విధంగా చర్యలు ప్రారంభించారు. దాని కోసం ప్రత్యేక క్యూలైన్లను సైతం ఏర్పాటు చేశారు. పరిమిత సంఖ్యలోనే అంతరాలయ దర్శనాన్ని ఏడాది కల్పిస్తున్న అధికారులు, రూ.100, రూ 300 టికెట్లను వివిధ ప్రదేశాల్లో విక్రయించేందుకు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అంతరాలయం రూ 500 టికెట్లను కూడా ఈ ఏడాది పరిమిత సంఖ్యలోనే జారీ చేయనున్నారు.

6 / 7
ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యం వివిధ పూజల కోసం ప్రతిరోజు నాలుగు గంటలు వివిధ సందర్భాల్లో కేటాయించునున్నారు. ఇదే సమయంలో దర్శనాలను నిలుపు చేసి మిగిలిన 20 గంటలు అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు కల్పించనున్నారు. ఇక మూలా నక్షత్రం రోజున మాత్రం అన్ని విఐపి దర్శనాలను నిలుపుదల చేసి అందరికీ సర్వదర్శనమే అందించే విధంగా ఏర్పాటు జరుగుతున్నాయి

7 / 7
Follow us