- Telugu News Photo Gallery Spiritual photos Gaja Lakshmi Raja Yoga brings good luck to these three zodiac signs
గజ లక్ష్మీ రాజయోగం.. వీరికి అదృష్టం తలుపు తట్టినట్లే!
గ్రహాల కలయిక లేదా గ్రహాల సంచారం వలన కొన్ని సార్లు రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే త్వరలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడ నుంది . దీంతో మూడు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనున్నదంట. కాగా, ఏ గ్రహాలు సంచారం చేయనున్నాయి? గజ లక్ష్మీ రాజయోగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Nov 15, 2025 | 5:02 PM

2026వ సంవత్సరంలో శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించనున్నదంట. దీంతో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడ నుంది. అంతే కాకుండా, గురు గ్రహం, శుక్ర గ్రహం కూడా ఒకే రాశిలో కలవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం, వలన మూడు రాశుల వారికి ధనం, విజయం , ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరంటే?

మేష రాశి : మేష రాశి వారికి గజలక్ష్మి రాజయోగం వలన అదృష్టం తలుపు తడుతుందంట. అంతే కాకుండా వీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అంతే కాకుండా, మేష రాశి వారికి, నాలుగు, మూడవ స్థానంలో రాజయోగం ఏర్పడటం వలన ఈ రాశి వారు అత్యధికంగా ప్రయోజనాలు పొందుతారంట. వ్యాపారంలో అత్యధిక లాభాలు పొందుతారు. అదృష్టం కూడా వీరికి కలిసి రావడంతో మంచి ఉద్యోగం సాధించే అవకాశం ఉన్నదంట.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి గజ లక్ష్మి రాజయోగం వలన అదృష్టం కలిసి వస్తుందంట. ఈ రాశి వారికి తొమ్మిదవ స్థానంలో రాజయోగం ఏర్పడటం వలన ఆకస్మిక ధనలాభం చేకూరుతుందంట. అంతే కాకుండా అప్పుల సమస్యల నుంచి బయటపడి, ఎక్కువగా డబ్బులు సంపాదిస్తారంట. వీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారంట.

తుల రాశి : తుల రాశి వారికి గజ లక్ష్మి రాజయోగం వలన వీరికి కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కొత్త ఉద్యోగంలో చేరడం లేదా, వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. అంతే కాకుండా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రాశి వారి విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు సంపాదిస్తారు.

చాలా కాలంగా ఉన్న అనారోగ్యం సమస్యలతో బాధపడే వారు వాటి నుంచి త్వరగా బయటపడతారు.ఇక ఈ రాశి అవివాహితులకు ఈ సమయం శుభంగా ఉంటుంది . వివాహం నిశ్చయం అయ్యే ఛాన్స్ ఉంది. అదృష్టం తోడుగా ఉంటుంది. కష్టానికి పూర్తి ఫలితం లభిస్తుంది.



