Ayodhya: అంగరంగ వైభవంగా దీపావళి దీపోత్సవ్.. భక్తుల మదిలో ఆధ్యాత్మిక భావనను రగిలింపజేసిన అయోధ్య
శ్రీరాముని పుణ్య భూమి అయోధ్యలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు. గతంలో నిర్వహించిన దానికంటే గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి భక్తుల హాజరయ్యారు. ఒకవైపు లక్షల దీపకాంతులు, మరో వైపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన లైట్ సెట్టింగ్, ఆకాశంలో నక్షత్రాలను పోలిన బాణా సంచా మెరుపులు. వీటిని చూసిన భక్తులు ఆధ్యాత్మిక చింతనతోపాటూ తన్మయత్వంతో మునిగిపోయారు.