Children Astrology: ఇటు చదువులు, అటు ఉద్యోగంలో వారు దూసుకుపోవడం పక్కా.. ! మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

ఈ ఏడాది పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది. పెద్దల రాశుల ప్రకారం ఈ ఏడాది పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఇక్కడ పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతక చక్రంలో పంచమ స్థానం పిల్లలకు సంబంధించిన స్థానం. పుత్ర కారకుడు గురు గ్రహం. ఈ రెండు అంశాలను బట్టి గ్రహ సంచారం ప్రకారం పిల్లల పరిస్థితి ఎలా ఉండబోతోందో ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది.

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 11, 2023 | 7:03 PM

ఈ ఏడాది పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది. పెద్దల రాశుల ప్రకారం ఈ ఏడాది పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఇక్కడ పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతక చక్రంలో పంచమ స్థానం పిల్లలకు సంబంధించిన స్థానం. పుత్ర కారకుడు గురు గ్రహం. ఈ రెండు అంశాలను బట్టి గ్రహ సంచారం ప్రకారం పిల్లల పరిస్థితి ఎలా ఉండబోతోందో ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. ముఖ్యంగా చదువులు, కెరీర్, పెళ్లి వంటి విషయాలకు ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.

1 / 13
మేషం: ఈ రాశిలో గురువు సంచారం చేయడం, పంచమాధిపతి రవి అనుకూలంగా ఉండడం వల్ల ఈ ఏడాది ఈ రాశివారి సంతానం అటు చదువుల్లోనే కాక, ఇటు వృత్తి, ఉద్యోగాల్లో కూడా రాణించే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. చదువులకు సంబంధించి పిల్లల్లో ఒకరు విదేశాలకు ఉన్నత విద్యకు వెళ్లే అవకాశం కూడా ఉంది. పిల్లల మీద భారీగా ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది.

2 / 13
వృషభం: ఈ రాశివారికి పుత్ర కారకుడైన గురువు వ్యయ స్థానంలో ఉండడం, పంచమ స్థానాధిపతి చర రాశిలో ఉండడం వల్ల పిల్లలు చదువులు, వృత్తి, ఉద్యోగాల
కారణంగా దూర ప్రాంతాలు లేదా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ స్థిరపడడం కూడా జరగవచ్చు. పెళ్లి సంబంధం కూడా దూర ప్రాంతంలో ఉన్నవారితోనే
నిశ్చయం అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించినంత వరకూ పిల్లలకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉండకపోవచ్చు.

వృషభం: ఈ రాశివారికి పుత్ర కారకుడైన గురువు వ్యయ స్థానంలో ఉండడం, పంచమ స్థానాధిపతి చర రాశిలో ఉండడం వల్ల పిల్లలు చదువులు, వృత్తి, ఉద్యోగాల కారణంగా దూర ప్రాంతాలు లేదా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ స్థిరపడడం కూడా జరగవచ్చు. పెళ్లి సంబంధం కూడా దూర ప్రాంతంలో ఉన్నవారితోనే నిశ్చయం అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించినంత వరకూ పిల్లలకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉండకపోవచ్చు.

3 / 13
మిథునం: లాభ స్థానంలో గురువు ఉండడం, పంచమ స్థానాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగపరంగానూ బాగా పురోగతి సాధించే అవకాశం ఉంది. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న పిల్లలు తప్పకుండా తాము కోరుకున్నకోర్సులలో చేరడం జరుగుతుంది. పిల్లల్లో ఒకరు
ఉద్యోగపరంగా స్థిరత్వం పొందుతారు. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదరడానికి కూడా వీలుంది. పిల్లలకు మంచి గుర్తింపు లభిస్తుంది.

మిథునం: లాభ స్థానంలో గురువు ఉండడం, పంచమ స్థానాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగపరంగానూ బాగా పురోగతి సాధించే అవకాశం ఉంది. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న పిల్లలు తప్పకుండా తాము కోరుకున్నకోర్సులలో చేరడం జరుగుతుంది. పిల్లల్లో ఒకరు ఉద్యోగపరంగా స్థిరత్వం పొందుతారు. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదరడానికి కూడా వీలుంది. పిల్లలకు మంచి గుర్తింపు లభిస్తుంది.

4 / 13
కర్కాటకం: దశమ స్థానంలో గురు సంచారం వల్ల, ద్వితీయ స్థానంలో పుత్ర స్థానాధిపతి ఉండడం వల్ల ఈ రాశివారి సంతానంలో ఒకరు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం సంపాదించుకోవడం జరుగు తుంది. చదువుల్లో కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం మాత్రం కనిపించడం లేదు. కెరీర్ పరంగా పిల్లల జీవితం ఒక ముఖ్యమైన మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు. దూర ప్రాంతంలో స్థిరపడే సూచనలున్నాయి.

5 / 13
సింహం: పుత్ర కారకుడు, పుత్ర స్థానాధిపతి అయిన గురు గ్రహం భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి పిల్లలకు సంబంధించిన సమస్యలన్నీ తీరిపోయే అవకాశం ఉంది. ఈ రాశివారి పిల్లలు తప్పకుండా ఉన్నత విద్యకు, మంచి ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. టెక్నికల్ లేదా టెక్నలాజికల్ కోర్సులో చేరడానికి కూడా వీలుంది. దూర ప్రాంతాలలో లేదా విదేశాలలో స్థిరపడిన బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే సూచనలు కూడా ఉన్నాయి.

6 / 13
కన్య: పుత్ర కారకుడైన గురువు ఈ రాశివారికి ఏమాత్రం అనుకూలంగా లేకపోవడం వల్ల, పంచమాధిపతి అయిన శనీశ్వరుడు స్వక్షేత్రంలో ఉన్నందువల్ల పిల్లలు చదువుల విషయంలో, ఉన్నత విద్యకు వెళ్లే విషయంలో బాగా కష్టపడడం, చాలా కాలం నిరీక్షించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నంలో కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సొంత ఊర్లో చదువుకోవడం, ఉన్న ఊరిలోనే ఉద్యోగం సంపాదించడం వంటివి జరిగే సూచనలున్నాయి.

7 / 13
తుల: సప్తమంలో గురు సంచారం, పంచమంలో పంచమాధిపతి సంచారం ఈ రాశివారికి అనుకూలంగా ఉన్నాయి. పిల్లల మీద ఈ రాశివారు పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయి. పిల్లలు ఉన్నత విద్యకు వెళ్లడం, ఇష్టపడిన కోర్సులో చేరడం, మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించడం, వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడడం, మంచి పెళ్లి సంబంధం కుదరడం వంటివి తప్పకుండా జరిగే అవకాశం ఉంది. చదువులకు, ఉద్యోగాలకు, పెళ్లికి విదేశీ కనెక్షన్ ఉండే సూచనలు కూడా ఉన్నాయి.

8 / 13
వృశ్చికం: పుత్ర కారకుడు, పుత్ర స్థానాధిపతి అయిన గురు గ్రహం ఆరవ రాశిలో సంచరించడం వల్ల ఈ రాశివారికి పిల్లలకు సంబంధించిన ప్రతి ప్రయత్నంలోనూ శ్రమాధిక్యత కనిపిస్తోంది. అతి కష్టం మీద పిల్లలను వారికి ఇష్టమైన కోర్సుల్లో చేర్పించడం, పైగా దూర ప్రాంతాల్లో మాత్రమే పిల్లలకు విద్యావకాశాలు లభించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగాలు కూడా దూర ప్రాంతంలో సంపాదించుకునే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది.

9 / 13
ధనుస్సు: పంచమాధిపతి కుజుడు అనుకూలంగా ఉండడం, పుత్ర కారకుడైన గురువు పంచమ స్థానంలోనే సంచారం చేస్తుండడం వల్ల ఈ రాశివారి పిల్లల జీవితాలలో
తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చదువుల్లోనే కాక, ఉద్యోగాల్లో సైతం రాణించడం, మంచి గుర్తింపు తెచ్చుకోవడం వంటివి జరుగుతాయి. విదేశాల్లో చదువుకోవడం, ఉద్యోగం సంపాదించడం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది.

ధనుస్సు: పంచమాధిపతి కుజుడు అనుకూలంగా ఉండడం, పుత్ర కారకుడైన గురువు పంచమ స్థానంలోనే సంచారం చేస్తుండడం వల్ల ఈ రాశివారి పిల్లల జీవితాలలో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చదువుల్లోనే కాక, ఉద్యోగాల్లో సైతం రాణించడం, మంచి గుర్తింపు తెచ్చుకోవడం వంటివి జరుగుతాయి. విదేశాల్లో చదువుకోవడం, ఉద్యోగం సంపాదించడం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది.

10 / 13
మకరం: ఈ రాశివారికి పుత్ర కారకుడైన గురువు నాలుగవ (విద్య) స్థానంలో ఉండడం, పంచమాధిపతి అయిన శుక్ర గ్రహం అనుకూలంగా ఉండడం వల్ల పిల్లల చదువులకు సంబంధించి ఎటువంటి సమస్యా ఉండకపోవచ్చు. పిల్లలు ఉన్నత విద్యకు వెళ్లడానికి, మంచి కోర్సులో చేరి స్థిరపడడానికి సమయం అనుకూలంగా ఉంది.
ఉద్యోగపరంగా కూడా పిల్లలు పురోగతి చెందడానికి అవకాశం ఉంది. అయితే, స్వదేశంలోనే లేదా సొంత ఊర్లోనే వారికి విద్యా, ఉద్యోగావకాశాలు అందివస్తాయి.

మకరం: ఈ రాశివారికి పుత్ర కారకుడైన గురువు నాలుగవ (విద్య) స్థానంలో ఉండడం, పంచమాధిపతి అయిన శుక్ర గ్రహం అనుకూలంగా ఉండడం వల్ల పిల్లల చదువులకు సంబంధించి ఎటువంటి సమస్యా ఉండకపోవచ్చు. పిల్లలు ఉన్నత విద్యకు వెళ్లడానికి, మంచి కోర్సులో చేరి స్థిరపడడానికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా కూడా పిల్లలు పురోగతి చెందడానికి అవకాశం ఉంది. అయితే, స్వదేశంలోనే లేదా సొంత ఊర్లోనే వారికి విద్యా, ఉద్యోగావకాశాలు అందివస్తాయి.

11 / 13
కుంభం: ఈ రాశివారికి పుత్రకారకుడైన గురువు అనుకూలంగా లేనందువల్ల, పుత్ర స్థానాధిపతి అయిన బుధుడు మాత్రం కొద్దిగా అనుకూలంగా ఉన్నందువల్ల పిల్లల
చదువుల విషయంలో కొద్దిగా రాజీ పడాల్సి వస్తుంది. పిల్లలు ఉన్నత విద్యకు సంబంధించి కొద్దిగా కష్టపడడం, ఇబ్బంది పడడం జరుగుతుంది. వీరికి ఉన్నత విద్యకు అవకాశాలు తక్కువ. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడం, అనుకోకుండా పెళ్లి సంబంధం కుదరడం వంటివి జరిగే అవకాశం ఉంది.

కుంభం: ఈ రాశివారికి పుత్రకారకుడైన గురువు అనుకూలంగా లేనందువల్ల, పుత్ర స్థానాధిపతి అయిన బుధుడు మాత్రం కొద్దిగా అనుకూలంగా ఉన్నందువల్ల పిల్లల చదువుల విషయంలో కొద్దిగా రాజీ పడాల్సి వస్తుంది. పిల్లలు ఉన్నత విద్యకు సంబంధించి కొద్దిగా కష్టపడడం, ఇబ్బంది పడడం జరుగుతుంది. వీరికి ఉన్నత విద్యకు అవకాశాలు తక్కువ. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడం, అనుకోకుండా పెళ్లి సంబంధం కుదరడం వంటివి జరిగే అవకాశం ఉంది.

12 / 13
మీనం: గురు గ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల, పంచమాధిపతి అయిన చంద్రుడు కూడా అనుకూలంగా సంచరిస్తున్నందువల్ల పిల్లలకు ఈ ఏడాది మంచి భవిష్యత్తు
ఉందనిపిస్తోంది. ఉన్నత విద్యకు, చదువుల్లో పురోగతికి, ఆశించిన కోర్సులో సీటు సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు
సఫలం కావడం, ఉద్యోగంలో పురోగతి చెందడం, స్థిరత్వం ఏర్పడడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి సంబంధం కుదరకపోవచ్చు.

మీనం: గురు గ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల, పంచమాధిపతి అయిన చంద్రుడు కూడా అనుకూలంగా సంచరిస్తున్నందువల్ల పిల్లలకు ఈ ఏడాది మంచి భవిష్యత్తు ఉందనిపిస్తోంది. ఉన్నత విద్యకు, చదువుల్లో పురోగతికి, ఆశించిన కోర్సులో సీటు సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడం, ఉద్యోగంలో పురోగతి చెందడం, స్థిరత్వం ఏర్పడడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి సంబంధం కుదరకపోవచ్చు.

13 / 13
Follow us