Telugu News » Photo gallery » Spiritual photos » Chanakya Niti 5 Lessons of Acharya Chanakya, who understood its meaning, nothing can spoil his bad time Know the Details
Chanakya Niti: ఈ 5 విషయాలను అర్థం చేసుకుంటే.. జీవితంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు..!
Shiva Prajapati |
Updated on: Jul 15, 2022 | 10:47 AM
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించి అనేక కీలక విషయాలను పేర్కొన్నారు. ఇవి.. జీవితంలో వచ్చే ఎంతటి సంక్షోభం నుంచైనా..
Jul 15, 2022 | 10:47 AM
దొంగిలించబడిన డబ్బు - దొంగతనం చేసి.. సంపాదించిన డబ్బు లేదా తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బులు వ్యక్తి వద్ద ఎక్కువ కాలం ఉండదు. అలాంటి సంపాదనకు విలువ ఉండదు.. అటువంటి వ్యక్తిని ఎవరూ గౌరవంగా చూడరు. కనుక దొంగతనం చేసి డబ్బు సంపాదించకండి.
1 / 5
స్త్రీలు, పురుషులు తమ భాగస్వామి అందంగా కనిపించాలని కోరుకుంటారనేది నిజం. అయితే చాలా మంది మహిళలు పురుషుల వ్యక్తిత్వంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే.. అతని గొప్ప గుణమని నిరూపించవచ్చు. స్త్రీలు అత్యాశ లేదా అహంకార ధోరణులను కలిగి ఉన్న పురుషుల నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. మహిళలు నిజాయితీగా, విధేయతతో ఉన్నవారిని ఇష్టపడతారు. అటువంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు.
2 / 5
తప్పుడు నిర్ణయాల తీసుకునే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు - తప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులను దూరం ఉంచండి. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ముందు నుంచి ప్రోత్సహిస్తారు. వెనుక నుంచి మిమ్మల్ని ఎగతాళి చేస్తారు.
3 / 5
అసూయ: కోపంలా అసూయ కూడా మనిషికి అతి పెద్ద శత్రువు అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అసూయ మనిషిని ముందుకు సాగనివ్వదు. అసూయపడే వ్యక్తి ఎప్పుడూ తనతో పాటు, ఇతరుల విజయానికి కూడా అడ్డుగా ఉంటాడు.
4 / 5
మోసం చేయడం ద్వారా - ఆచార్య చాణక్యుడు ప్రకారం.. మోసం చేసి సంపాదించిన డబ్బు ఆ వ్యక్తి దగ్గర ఎప్పుడూ నిలబడదు. ఎంత ధనం, సిరి సంపదలున్నా అలాంటి వ్యక్తులను.. ఆ ఇంటి కుటుంబ సభ్యులను ఎవరూ గౌరవించరు