AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Psychology: చూసే చూపులోనే ఉందంతా.. మొదట చూసే దాన్నిబట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఇట్టే చెప్పొచ్చు..

ఈ చిత్రంలో ముందు మీకు ఏది కనిపిస్తుందో అదే మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. రెండు విభిన్న ఆకారాలను కలిగి ఉన్న ఈ ఫొటోలో చెవి, పాము రెండూ ఉన్నాయి. ఏది ముందుగా మీ దృష్టిని ఆకర్షిస్తుందో గమనించాలి. ఈ ఎంపిక మీలోని లోతైన పరిశీలన శక్తిని సూచిస్తుంది. అంతేకాకుండా ఈ టెస్ట్ మనలో దాగి ఉన్న లక్షణాలను బయటకు చూపిస్తుంది..

Psychology: చూసే చూపులోనే ఉందంతా.. మొదట చూసే దాన్నిబట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఇట్టే చెప్పొచ్చు..
Optical Illusion Personality Test
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 16, 2025 | 5:38 PM

మనసు చెప్పే సంగతులు చిత్రంగా ఉంటాయి. ఎన్నో భ్రాంతులకు గురి చేసి అది నిజమేనని నమ్మిస్తుంది. కానీ వాస్తవం పూర్తిగా విరుద్దంగా ఉంటుంది. అందుకే మనసుకు, బ్రెయిన్‌కి ఎప్పుడూ పొత్తు కుదరదు. దీనిని రుజువు చేసే పర్సనాలిటీ టెస్ట్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మీరు చేయాల్సిందల్లా ఈ చిత్రంలో ముందు మీకు ఏది కనిపించిందో చెప్పడం మాత్రమే. రెండు విభిన్న ఆకారాలను కలిగి ఉన్న ఈ ఫొటోలో చెవి, పాము రెండూ ఉన్నాయి. ఏది ముందుగా మీ దృష్టిని ఆకర్షిస్తుందో గమనించాలి. ఈ ఎంపిక మీలోని లోతైన పరిశీలన శక్తిని సూచిస్తుంది. అంతేకాకుండా ఈ టెస్ట్ మనలో దాగి ఉన్న వ్యక్తిత్వ లక్షణాలను బయటకు చూపిస్తుంది.

మొదటగా మీకు చెవి కనిపిస్తే..

ఈ ఫొటోలో మొదటగా మీకు చెవి కనిపిస్తే.. మీరు సహజంగా సానుభూతిపరులని అర్ధం. డే డ్రీమ్స్‌ ఎక్కువగా కనే అలవటు వీరికి ఉంటుంది. వీరిది సున్నితమైన మనసు. వీరికి కపటత్వం తెలియదు. అన్యాయాన్ని సహించలేరు. వీరి స్నేహబృందంలో అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిగా ఉంటారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అయితే ఈ ప్రశంసనీయమైన లక్షణం కొన్నిసార్లు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. ఇలాంటి వారు తమకు నచ్చని విషయాలకు ‘నో’ చెప్పడానికి తెగ ఇబ్బంది పడతారు. అందువల్ల ఇతరులు సులువుగా మోసం చేస్తారు. వేగం కంటే డీప్‌నెస్‌కు ఎక్కువ విలువ ఇచ్చే ఈ ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు సానుభూతి, దయ చూపడంలో మానవత్వం కలిగి ఉంటారు. ఒక్కోసారి తమ సొంత సమయాన్ని కూడా ఇతరుల కోసం త్యాగం చేయవల్సి ఉంటుంది.

అదే పాము కనిపిస్తే మీరెలంటి వారంటే..

మీ దృష్టి మొదట పాముపై కేంద్రీకృతమైతే మాత్రం.. వీరు ఇండిపెండెంట్‌ వ్యక్తులు. లోతైన దృష్టి, సాహసం పట్ల అభిరుచి కలిగి ఉంటారు. ఇతరుల కంటపడని సూక్ష్మ వివరాలను త్వరగా గ్రహించడం వీరి ప్రత్యేకత. ఎల్లప్పుడూ కొత్త సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉండే వ్యక్తిత్వం వీరిది. అది చేయ్‌.. ఇది చేయ్‌.. అంటూ పెత్తనం చేసేవారిని వీరు సహించలేరు. వీరు స్వయంప్రతిపత్తికి ఎక్కువ విలువ ఇస్తారు. అందుకే ఎల్లప్పుడూ తమ స్వంత మార్గాన్ని ఏర్పరచుకోవడానికి ఇష్టపడతారు. సాహసం పట్ల వీరికున్న మక్కువ కారణంగా ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. దీర్ఘకాలిక కట్టుబాట్ల కంటే అభిరుచి, ఉత్సాహానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. జీవితాన్ని తాజాగా, ఆసక్తిగా మలచుకోవడంలో వీరు సిద్ధహస్తులు. వీరి స్వతంత్ర్య అభిప్రాయాలు కొన్నిసార్లు ఇతరులకు దూరం చేస్తుంది. అయితే ఇదే ప్రేరణ, అన్వేషణ స్ఫూర్తిని పెంచుతుంది. జీవితం అందించే అంతులేని అవకాశాలకు వీరు బాగా సద్వినియోగపరచుకుంటారు. తెలియని ప్రాంతాలను అన్వేషించడం, యథాతథ స్థితిని సవాలు చేయడం ద్వారా జీవితంలో కొత్త అనుభవాలు, అవకాశాలను అందిపుచ్చుకుంటారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ వ్యక్తిత్వ పరీక్ష స్వీయ ప్రతిబింబాన్ని తెలిపే ఒక మార్గం మాత్రమే. ఇది ఖచ్చితమైన కొలమానం కాదు. మీ మొదటి చూపు చెవిపై పడినా లేదా పాముపై పడినా.. మనిషుల వ్యక్తిత్వాలు అనేక లక్షణాల సమ్మేళనం అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ పరీక్షను మీలోని విభిన్న కోణాలను అన్వేషించడానికి ఒక ప్రాంప్ట్‌గా ఉపయోగించడం మంచిది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.