Optical Illusion: మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న అంకెలు ఏంటో చెప్పగలరా..?
మీకు ఫోటో పజిల్స్ అంటే ఇష్టమా.? ఎప్పుడూ ఏదొక పజిల్‌ను ఓ పట్టు పట్టేస్తుంటారా.? అయితే ఇదిగో ఈ పజిల్ మీకోసమే.. మీ కళ్ల షార్ప్‌నెస్ ఏంటో చెప్పడమే కాదు.. మీ మెదడుకు కూడా మేత వేస్తుంది ఈ ఫోటో పజిల్. మరి లేట్ ఎందుకు ఆ పజిల్ ఏంటో చూసేద్దాం.

సోషల్ మీడియాలో రోజూ కొన్ని ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నారు. వీటిలో ఉన్న విషయాలు అదో మాదిరి కిక్ ఇస్తూ ఉంటాయి. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్‌లలో దాగున్న వాటిని కనిపెట్టేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తారు. ఈ చిత్రాలు మనం కాస్త దృష్టి పెట్టి చూస్తేనే సమాధానాలు దొరుకుతాయి. ఇవి మన మైండ్‌ను షార్ప్ చేయడంతోపాటు కంటిచూపును మెరుగుపరుస్తాయి. అలానే అబ్జర్వేషన్ స్కిల్స్ పెరుగుతాయి. తాజాగా, ఓ ఆప్టికల్ ఇల్యూషన్ తెగ వైరల్ అవుతోంది. నంబర్ ఫొటో అందర్నీ తెగ గజిబిజి చేస్తోంది. ఈ చిత్రంలో కనుగొనాల్సి ఏంటంటే..? రెండు అంకెలు దాగున్నాయి. వీటిని 30 సెకన్లలో కనుగొనాలి. అలా కనుగొంటే.. మీ మెదడు షార్ప్‌గా ఉన్నట్లు లెక్క. మీరు జీనియస్ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.
మీరు కూడా దీనిలో ఉన్న సంఖ్యలను గుర్తించారా..? అయితే మీరు తోపులండీ.. ఇంకా గుర్తించని వారుంటే.. ఓ క్లూ కూడా ఇస్తున్నాం.. ఈ చిత్రాన్ని జూమ్ అవుట్ లేదా చిన్నదిగా చేసి చూడండి.. సంఖ్యలు కనిపిస్తాయి. క్లూ ఇచ్చినా కనిపెట్టలేదా.. నో వర్రీ.. సమాధానం మేమే చెప్పేస్తాం…. ఈ చిత్రంలో ఉన్న సంఖ్యలు ‘‘20’’. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ మీకు కూడా నచ్చితే.. ఫ్రెండ్స్ కు షేర్ చేసి ఛాలెంజ్ చేయండి..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..