Watch: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన కారు.. అమాంతంగా ఎగిరి అక్కడ పడింది..
వైరల్ వీడియోలో కారు ఢీకొన్న ధాటికి ఒక మహిళ కిందపడి సమీపంలోని కాంపౌండ్‌కు వేలాడుతూ చిక్కుకుంది. ఈ ఘటనలో ఆ మహిళ కాలికి తీవ్ర గాయమైంది. ఈ సంఘటనకు సంబంధించి నిందితుడు కారు డ్రైవర్ సతీష్‌పై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసినట్టుగా తెలిసింది.. నిందితుడు సతీష్ కు తన పొరుగువాడు మురళీ ప్రసాద్ తో గొడవ ఉందని, అతన్ని చంపాలని అనుకున్నాడని చెబుతున్నారు.

సోషల్ మీడియాలో అనేక వైరల్ వీడియోలు కనిపిస్తాయి. అందులో రకరకాల సంఘటనలు కనిపిస్తాయి. కొన్ని కొన్ని సార్లు షాకింగ్ ప్రమాదాలు కూడా వైరల్ అవుతుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. వీడియోలో ఒక బైకర్‌ను ఢీకొట్టబోయిన కారు డ్రైవర్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టాడు. ఆమెను ఢీకొట్టి పారిపోయాడు. ఈ సంఘటన మంగళూరులోని బెజై కాపికాడ్‌లోని 6వ ప్రధాన రోడ్డుపై జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
వైరల్ వీడియోలో కారు ఢీకొన్న ధాటికి ఒక మహిళ కిందపడి సమీపంలోని కాంపౌండ్‌కు వేలాడుతూ చిక్కుకుంది. ఈ ఘటనలో ఆ మహిళ కాలికి తీవ్ర గాయమైంది. ఈ సంఘటనకు సంబంధించి నిందితుడు కారు డ్రైవర్ సతీష్‌పై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసినట్టుగా తెలిసింది.. నిందితుడు సతీష్ కు తన పొరుగువాడు మురళీ ప్రసాద్ తో గొడవ ఉందని, అతన్ని చంపాలని అనుకున్నాడని చెబుతున్నారు. దీని ప్రకారం, మురళి వస్తున్న రోడ్డుపై వేచి ఉన్న సతీష్, బైక్ పై వస్తున్న మురళీ ప్రసాద్ ను చూసి తన కారును డ్రైవ్ చేసుకుని అతన్ని ఢీకొట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇది జరగబోతుండగా, అదే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళను కారు ఢీకొట్టింది. కారు ఢీకొన్న దాటికి ఆ మహిళ అమాంతంగా పైకి ఎగిరిపడింది. ఆ పక్కనే ఉన్న ఓ ఇంటి కాంపౌండ్ చెట్టు, వైర్లలో చిక్కుకుని వేలాడుతోంది. అది గమనించిన స్థానికులు వెంటనే స్పందిచి బాధితురాలిని రక్షించారు.
#Mangalore #accident at #kapikad, Speeding Car Crashes into Cyclist, Woman Thrown Against Wall in Attempted #Murder Case pic.twitter.com/SozBtHgpaA
— Headline Karnataka (@hknewsonline) March 13, 2025
ఈ సంఘటన తర్వాత కారు నడిపిన సతీష్ అక్కడి నుంచి పారిపోయాడు. ఉర్వ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు, వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హిట్ అండ్ రన్ కేసు నమోదయ్యాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




