- Telugu News Photo Gallery These are the zodiac signs that will benefit financially due to Saturn transit
నక్షత్రం మార్చుకుంటున్న శని.. వీరికి పట్టిందల్లా బంగారమే!
గ్రహాలు నక్షత్రం లేదా రాశులను మారడం అనేది చాలా సహజం. అయితే ఏప్రిల్ 28వ తేదీ నుంచి శని తన నక్షత్రాన్ని మార్చుకోనుంది. దాదాపు శని గ్రహం రెండు ఏళ్లకు పైగా ఒకే రాశి లేదా, నక్షత్రంలో ఉంటాడు. కానీ ఈ గ్రహం తన ఏప్రిల్ నెలలో తన నక్షత్రాన్ని మార్చుకోవడం వలన కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఆ రాశులు ఏవి అంటే?
Updated on: Mar 16, 2025 | 4:14 PM

శని గ్రహం తన నక్షత్రాన్ని మార్చుకోవడం వలన ఏప్రిల్ 28 నుంచి ఈ మూడు రాశుల వారు, మేష రాశి, వృషభ రాశి వారికి అదృష్టం పట్టనుంది. కాగా, అసలు ఆ రాశులకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి వారికి శని గ్రహం తన రాశిని మార్చుకోవడం వలన అనేక మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఏ పని చేపట్టినా అందులో విజయం వీరి సొంతం అవుతుంది ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

వృషభ రాశి వారికి శని ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి మారడం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా మీకు బాగుంటుంది. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. బంగారం లేదా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

సింహ రాశి వారికి శని నక్షత్రం మారడం వలన చాలా కలిసి వస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి వారికి ఇది మంచి సమయం. ఏ పనిలోనైనా విజయం వీరిసొంతం అవుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. విద్యార్థులు మంచి ర్యాంక్‌లతో విజయం సాధిస్తారు.

ధనలాభం ఉంది. ఈ రాశి వారు ప్రయాణాలు చేయడానికి ముందు తమ ఇష్టదైవం లేదా కుల దైవాన్ని ప్రార్థించుకోవడం చాలా ముంఖ్యం. ఎందుకంటే దాని వలన వీరికి మరింత కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.



