- Telugu News Photo Gallery Cinema photos Komalee Prasad shared latest cutest photos goes viral in social media
Komalee Prasad: స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈమెలా భువికి చేరింది.. క్యూటీ కోమలి..
కోమలీ ప్రసాద్ ఓ చలనచిత్ర నటి, ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో పని చేస్తుంది. నెపోలియన్, హిట్ 2 ది సెకండ్ కేస్ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది ఈ వయ్యారి భామ. తెలుగులో ఈ ముద్దుగుమ్మకు మామూలుగా ఫాలోయింగ్ లేదు. మోడల్ గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా, బుల్లితెరపై కూడా కొన్ని షోలలో కనిపించి సెలబ్రిటీగా బాగా ఫేమస్ అయింది. ఈ భామ గురించి పుట్టిన తేదీ, చదువు, డెబ్యూ వంటి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Mar 16, 2025 | 10:10 AM

24 ఆగస్ట్ 1995న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించింది కోమలి ప్రసాద్. కర్ణాటకలోని బళ్లారిలో పెరిగింది. ఆమె అహ్మద్‌నగర్‌లోని ప్రవర ఇన్‌స్టిట్యూడ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డెంటిస్ట్రీని అభ్యసించింది. దాని తర్వాత ఆమె తెలుగు చిత్ర పరిశ్రమపై తనకు ఆసక్తి పెరిగింది.

2016లో నేను సీతాదేవి అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. తర్వాత 2017లో నెపోలియన్ సినిమాలో కనిపించింది. తర్వాత 2020లో అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనే తెలుగు చిత్రాలలో కనిపించింది.

2022లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి జోడిగా సెబాస్టియన్ పి.సి. 524 అనే సినిమాలో నటించింది. ఆమె వెబ్ సిరీస్ లూజర్‌లో, ఫైండింగ్ యువర్ పెంగ్విన్‌లో, మోడరన్ లవ్ హైదరాబాద్ అనే ఆంథాలజీ సిరీస్‌లో కూడా కనిపించింది.

తర్వాత అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన హిట్ 2 ది సెకండ్ కేస్ సినిమాలో వర్ష అనే ఓ పోలిస్ ఆఫీసర్ పాత్రలో నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం శశివదనే అనే ఓ తెలుగు ప్రేమ కథలో కథానాయకిగా నటిస్తుంది.

విశాఖపట్నానికి చెందిన ఈ వయ్యారి సోషల్ మీడియాలో బాగా ఫేమస్. చేసింది తక్కువ సినిమాలైన ఈ ముద్దుగుమ్మకి కుర్రాళ్లలో ఫాలోయింగ్ చాల ఎక్కువగానే ఉంది. తాజాగా సోషల్ మీడియా ఈ బ్యూటీ ఫోటోలు తెగ వైరల్ చేస్తున్నారు కుర్రకారు.





























