- Telugu News Photo Gallery Cinema photos Athulya Ravi latest dazzling photos in trendy dress goes viral in social media
Athulya Ravi: సోయగంలో మన్మదుని భార్యకి ప్రతిరూపం ఈ సొగసరి .. డేజ్లింగ్ అతుల్య..
అతుల్య రవి కోయంబత్తూరుకి చెందిన నటి. ఆమె ప్రధానంగా తమిళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె 2017లో చలనచిత్ర అరంగేట్రం చేసింది. తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో కథానాయనికి ఆకట్టుకుంది. తెలుగులో కూడా సుపరిచితురాలు. ఈ బ్యూటీ గురించి కొన్ని విషయాలు మీ కోసం..
Updated on: Mar 16, 2025 | 8:22 AM

21 డిసెంబర్ 1994లో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో జన్మించింది అతుల్య రవి. ఈమె అసలు పేరు దివ్య. తమిళనాడులోని కోయంబత్తూరులోని వివేకం మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించింది.

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని కర్పగం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివింది. చెన్నైలోని SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో, కోయంబత్తూరులోని శ్రీ కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చదువుకుంది.

'పల్వాది కాదల్' అనే ఓ తమిళ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ ద్వారా నటనలో కెరీర్ ప్రారంభించింది ఈ వయ్యారి భామ. 2017లో కాదల్ కన్ కట్టుదే అనే ఓ తమిళ చిత్రంలో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ అతుల్య రవి.

2018లో V. Z. దురై యేమాలిలో ప్రధాన పాత్రలో నటించింది. తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది ఈ చిన్నది. 2023లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి జోడిగా మీటర్ అనే చిత్రంతో హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం తమిళంలో చెన్నై సిటీ గ్యాంగ్‌స్టార్స్ అనే కామెడీ హేస్ట్ చిత్రంలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో పాటు డీజిల్ అనే మరో సినిమాలో కథానాయకిగా నటిస్తుంది. ఈ రెండు సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.




