- Telugu News Photo Gallery Spiritual photos Career opportunities for Aries, Gemini, Leo and Capricorn; know about other zodiac signs
Job Astrology: కుంభ రాశిలో వక్రించిన శని గ్రహం.. ఆ రాశులకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం రావడం పక్కా.. !
తన స్వకేత్రమైన కుంభరాశిలో శని వక్రించి ఉండటం, రవి రెండు నెలల పాటు మంచి రాశుల్లో సంచారం చేయడం, కుజగ్రహం సింహ రాశిలో ఉండటం వంటి కారణాలవల్ల ఉద్యోగ అవకాశాలు బాగా పెరగటం, చిన్న ప్రయత్నాలకే భారీగా శుభ ఫలితాలు అనుభవానికి రావడం వంటివి జరిగే అవకాశం ఉంది.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Jul 20, 2023 | 3:14 PM

తన స్వకేత్రమైన కుంభరాశిలో శని వక్రించి ఉండటం, రవి రెండు నెలల పాటు మంచి రాశుల్లో సంచారం చేయడం, కుజగ్రహం సింహ రాశిలో ఉండటం వంటి కారణాలవల్ల ఉద్యోగ అవకాశాలు బాగా పెరగటం, చిన్న ప్రయత్నాలకే భారీగా శుభ ఫలితాలు అనుభవానికి రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు, ఉద్యోగం మారాలనుకుంటున్న వారు, ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నా వారికి ఇప్పుడు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ మంచి సమయం అక్టోబర్ 24 వరకు కొనసాగుతుంది. వివిధ రాశుల వారికి ఏ విధంగా కలిసి వచ్చేది ఇక్కడ పరిశీలిద్దాం.

మేషం: ఈ రాశి వారికి ఉద్యోగాలకు సంబంధించిన అంతవరకు సమయం అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఈ నెల 17 నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు ఈ అనుకూల సమయం కొనసాగుతుంది. చిన్న ప్రయత్నంతో అధిక లాభాలను పొందటం జరుగుతుంది. విదేశీ అవకాశాలు సైతం మెరుగు పడతాయి. ఏ రంగానికి చెందినవారు అయినప్పటికీ వారి రంగంలో ఈ రాశి వారు పురోగతి చెందడం జరుగుతుంది.

వృషభం: ఈ రాశికి చెందిన నిరుద్యోగులు, ఉద్యోగం మారాలనుకుంటున్న వారు తప్పకుండా ఒకటి రెండు నెలల్లో లబ్ధి పొందే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం అయినప్పటికీ అది సఫలం అయ్యే సూచనలు ఉన్నాయి. సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లోకి మారటం జరుగుతుంది. ఆఫర్లు అంది వస్తాయి. ఈ శుభ సమయం అన్ని రంగాల వారికి వర్తిస్తుంది. కొద్దిపాటి ప్రయత్నంతో తప్పకుండా శుభవార్త వినడం జరుగుతుంది.

మిథునం: ఈ రాశి వారికి అప్రయత్నంగా అనుకోకుండా మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. సిఫారసు లతో నిమిత్తం లేకుండా ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు పెరగటం జరుగుతుంది. ఈ రాశికి చెందిన నిరుద్యోగులు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆఫర్లకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవలసిన అవ సరం ఉంది. ఉద్యోగం మారాలనుకుంటున్న వారికి కూడా అవకాశాలు పెరగటం జరుగు తుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశి వారికి రవిగ్రహంతో పాటు కుజ గ్రహం కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా నిరుద్యోగ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఇతర సంస్థల్లోకి ఉద్యోగం మారదలచుకున్న వారి ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఆగస్టు నెల తరువాత వీరికి మరిన్ని ఆఫర్లు అంది వస్తాయి. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది.

సింహం: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈ రాశి వారు చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలలో వీరికి తప్పకుండా విజయం లభిస్తుంది. ఉద్యోగా నికి సంబంధించినంత వరకు ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినప్పటికీ అది తప్పకుండా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా సానుకూల వాతావరణం నెలకొని ఉంది.

కన్య: ఈ రాశి వారికి శని, రవి గ్రహాలు బాగా అను కూలంగా ఉన్నందువల్ల ప్రభుత్వ ఉద్యోగాలలో చేరటానికి అవకాశం ఉంది. ఆగస్టు నెలలో వీరు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడే సూచనలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం కూడా ఉంది. ఈ మంచి సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారు శుభవార్త వింటారు. ఉద్యోగ జీవితం సమూలంగా మార్పునకు లోనవుతుంది.

తుల: ఉద్యోగానికి సంబంధించి వీరి మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో ఉద్యోగం రావటం, ఇష్టమైన సంస్థకు ఉద్యోగం మారటం, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగంలో అధికారం చేపట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. రెండు మూడు అవకాశాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో విదేశాల నుంచి ఆఫర్ రావటం కూడా జరుగుతుంది. ప్రయత్నాలు సఫలం అవుతాయి.

వృశ్చికం: ఈ రాశి వారికి నిరుద్యోగ సమస్య నుంచి తప్ప కుండా విముక్తి లభిస్తుంది. అయితే, ఆ ఉద్యోగం అంతగా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు సరైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఉద్యోగంలో మార్పులు జరగటానికి అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది. పోటీ పరీక్షలలో విజయం సాధించ డానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి.

ధనుస్సు: ఉద్యోగానికి సంబంధించినంత వరకు ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినప్పటికీ అది విజయవంతం అవుతుంది. విదేశాలలో కానీ, బాగా దూర ప్రాంతంలో గానీ మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగం మారే అవకాశం లేదు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. ఇదే ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసు కుంటాయి. ఉద్యోగంలో మీ అవసరం పెరుగుతుంది.

మకరం: నిరుద్యోగులు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంది. కొద్ది కష్టంతో దూర ప్రాంతంలో ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ సఫలం అయ్యే సూచనలు ఉన్నాయి. ఓర్పు సహనాలతో వ్యవహరిస్తే ఉద్యోగం విషయంలో అంతా మంచే జరుగు తుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికారం చేపట్టడం కూడా జరుగుతుంది.

కుంభం: కొద్దిపాటి ప్రయత్నంతో నిరుద్యోగ సమస్య నుంచి తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. సొంత ఊర్లోనే కోరుకున్న ఉద్యోగంలో చేరటం జరుగు తుంది. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులకు పెద్దగా అవకాశం లేదు. ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలను తాత్కాలికంగా విర మించడం మంచిది. ఉద్యోగంలో సంతృప్తికర స్థాయిలో స్థిరత్వం లభిస్తుంది. అధికారుల నుంచి సహచరుల నుంచి ప్రోత్సాహం అందుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

మీనం: కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. విదేశాలలో ఉద్యోగం సంపాదించ డానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం సాఫీగా, హ్యాపీగా సాగి పోతుంది. అధికారుల నుంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రస్తుతానికి ఉద్యోగం మారే అవ కాశం లేదు. ఉద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగా లకు కూడా అవకాశం ఉంది. అయితే ఎక్కువగా విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నం చేయడమే మంచిది.





























