వాస్తు టిప్స్ : అప్పుల సమస్యల నుంచి బయటపడాలా.. ఈ చిట్కా ఫాలో అవ్వండి!
అప్పుల బాధలు అనేవి ఎవరికి ఉండవు చెప్పండి. చాలా మంది అప్పుల సమస్యలతో కుమిలిపోతుంటారు. ఎంత సంపాదించినా, ఇంటిలో డబ్బు నిలవకపోగా, రోజు రోజుకు అప్పులు పెరుగుతుండటంతో సతమతం అవుతారు. అయితే అలాంటి వారి కోసమే అద్భుతమైన సమాచారం. అది ఏదో ఇప్పుడు చూసేద్దాం పదండి!
Updated on: Aug 05, 2025 | 9:03 PM

అప్పుల బాధలు అనేవి ఎవరికి ఉండవు చెప్పండి. చాలా మంది అప్పుల సమస్యలతో కుమిలిపోతుంటారు. ఎంత సంపాదించినా, ఇంటిలో డబ్బు నిలవకపోగా, రోజు రోజుకు అప్పులు పెరుగుతుండటంతో సతమతం అవుతారు. అయితే అలాంటి వారి కోసమే అద్భుతమైన సమాచారం. అది ఏదో ఇప్పుడు చూసేద్దాం పదండి!

చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. కొంత మంది డబ్బు సంపాదించడంలో విఫలం అవుతే, మరికొంత మంది కష్టపడి సంపాదించిన డబ్బు నిలువకు రాకపోవడంతో మానసికంగా కుంగిపోతుంటారు. ఎంత కష్టపడినా మళ్లీ అప్పులే అవుతున్నాయని ఇబ్బందులకు లోనవుతుంటారు.అయితే అలా ఆర్థిక సమస్యలతో బాధపడే వారు కొన్ని పరిహారాలు చేయడం వలన సులభంగా అప్పుల ఊబిలో నుంచి బయటపడవచ్చు అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

చాలా మంది ఉదయం ఇంటిని శుభ్రపరుచుకుంటారు. కానీ కొంత మంది ఇంటి విషయంలో అంతగా శ్రద్ధ చూపెట్టరు. ఎక్కడి వస్తువులు అక్కడే, ఎక్కిడి చెత్త అక్కడే ఉంచేస్తుంటారు. కానీ వాస్తు ప్రకారం అది అస్సలే మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ప్రతి రోజూ ఉదయం నీట్‌గా ఇంటిని శుభ్రపరుచుకొని ఈ చిన్న పరిహారం చేయాలంట అది ఏమిటంటే?

తెల్లవారుజామున్నే లేచిన వెంటనే ఇంటి నాలుగు మూలలు శుభ్రం చేయాలంట, ఇంటిని శుభ్రపరిచినా, ప్రత్యేకంగా నాలుగు మూలలు ఎలాంటి ధూళి, దుమ్ము లేకుండా శుభ్రపరుచుకోవాలంట. తర్వాత తలస్నానం చేసి, ఇంటికి నాలుగు మూలల్లో చిటికెడు ఉప్పు వేయాలంట. తర్వాత దేవుడి గదిలో దీపం వెలిగించి, అప్పులు తీరిపోవాలని కోరుకొని, పూజ చేయాలంట. ఇలా చేయడం వలన అప్పులు త్వరగా తీరిపోతాయంట.

అంతే కాకుండా ప్రతి రోజూ ఉదయం లేచిన తర్వాత ఒక గ్లాస్ నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకొని, ఆ నీటిని తాగిన తర్వాతే ఏ పనినైనా ప్రారంభించినా ? లేదా బయటకు వెళ్లినా కలిసి వస్తుందంట. అలాగే మనశ్శాంతి కూడా లభిస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



