Astro Tips: అప్పులు తీర్చలేక తిప్పలు పడుతున్నారా.. ఈ మూగ జీవులకు రోజూ ఆహారాన్ని అందించండి..
సనాతన ధర్మంలో ప్రకృతిలోని ప్రతి జీవి దైవంతో సమానంగా భావిస్తారు. మొక్కలు, చెట్లు, పాములు, పక్షులు ఇలా అనేక రకరకాల జీవులకు ప్రత్యేక స్థానం ఇచ్చి పూజలు చేస్తారు. పురాణ గ్రంథాల్లో కూడా మూగ జీవులను ఆదరించడం వలన కలిగే ఫలితాలను వివరించారు. ఆకలి అన్నవారికి మాత్రమే కాదు నోరు లేని మూగ జీవులకు ఆహారాన్ని అందించడం పుణ్య కార్యక్రమమని.. పాపం నుంచి విముక్తి చేస్తుందని నమ్మకం. అయితే ఎవరైనా సంతాన లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నా.. ఇంట్లో ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతున్నా.. ఈ ఐదు జీవులకు ఆహారాన్ని అందించడం వలన సమస్యలు దూరం అవుతాయని శాస్త్రాలు పేర్కొన్నాయి. ఆ జీవులు ఏమిటో తెలుసుకుందాం..
Updated on: Aug 02, 2025 | 9:04 PM

సనాతన ధర్మంలో గృహస్తునికి కొన్ని ధర్మలున్నాయని పేర్కొంది. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం, ఆకలి అన్నవారికి భోజనం పెట్టడం వంటివి గృహస్త ధర్మాలే. ఇలా అవసరం ఉన్నవారికి సాయం చేయడం అనేది మంచి కర్మ అని.. ఇటువంటి కర్మలకు శుభఫలితాలు పొందుతారని పురాణాలు పేర్కొన్నాయి. అదే విధంగా ఆకలి అని అడగలేని మూగ జీవులకు సేవ చేయడం, ఆహారాన్ని అందించడం కూడా పుణ్యప్రదమైన కార్యం. పిల్లలు లేని దంపతులు, డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్న వారు ఏ రకమైన జీవికి ఎటువంటి ఆహారాన్ని అందిస్తే సమస్యలు తీరతాయో ఈ రోజు తెలుసుకుందాం..

ఆవు: హిందువులు ఆవుని గోమాత అని పిలుస్తారు. దైవంతో సమానంగా భావించి పూజిస్తారు. ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటాయని.. సమస్త జీవ రాశికి తల్లి అని నమ్మకం. అందుకనే చాలా మంది ఆవుని రోజూ పుజిస్తారు. అంతేకాదు ఎవరినా జాతకంలో గ్రహ దోషాలతో ఇబ్బంది పడుతుంటే ఆవుకి ఆహారాన్ని అందిస్తే గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. అంతేకాదు సంతానం కోసం చూసే దంపతులు అవుకు పచ్చ గడ్డి, గోధుమ పిండితో చేసిన రొట్టెలు, బెల్లం తినిపించడం వలన పిల్లలు పుడతారని పండితులు చెబుతున్నారు.

చేపలను కొంత మంది జలపుష్పాలు అని కూడా అంటారు. ఆహారం చేపలకు సూర్యాస్తమయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా శత్రు భయంతో ఉన్నా, కష్టాలతో ఇబ్బంది పడుతున్నా చేపలకు ఆహారం అందించడం వలన మేలు జరుగుతుంది. అప్పులు తీరక ఇబ్బంది పడేవారు.. ఆర్ధిక సంక్షోభంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నా... గోధుమ పిండితో చేసిన ఉండలు, మొక్క జొన్న తో చేసిన పాప్ కార్న్ ని చేపలకు ఆహారంగా అందించడం వలన ఫలితం లభిస్తుంది నమ్మకం. ఇంట్లో అక్వేరియం ఉంటే చేపలకు ఆహారం అందించడం మంచిది.

కుక్కలు: కాలభైరవుడిగా భావించి కుక్కలను పూజిస్తారు. కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వలన శనీశ్వరుడు, రాహు, కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా శనివారం కుక్కకు ఆహారాన్ని పెట్టడం వలన శని అనుగ్రహం లభిస్తుంది.. శని ప్రభావం నుంచి ఉపశమనం పొందవచ్చు,

చీమలు: ఎవరైనా రాహు దోషంతో ఇబ్బంది పడుతుంటే.. చీమలకు ఆహారం పెట్టడం వలన రాహు అనుగ్రహం కలిగి .. కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా నల్ల చీమలకు చక్కరని ఆహారంగా ఇవడం వలన కోరిక కోర్కెలు తీరతాయని విశ్వాసం. ఇంట్లో నల్ల చీమలు తిరగడం శుభప్రదం అని విశ్వాసం.

పక్షులు: కొన్ని రకాల పక్షులు ఇంటి ఆవరణలో సందడి చేయడం వలన మానసికంగా ప్రశాంతంగా ఉండడమే కాదు.. మంచిది కూడా.. పక్షులకు నీటిని పెట్టడం, తినడానికి చిరు ధాన్యం గింజలు అందించడం వలన స్టూడెంట్స్ కు మేలు జరుగుతుంది. ఉద్యోగం కోసం చూసే వారికి కెరీర్ కి సంబంధించిన కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లల కోసం చూస్తున్న భార్యాభర్తలు పక్షులకు ఆహారం అందించడం ద్వారా ఫలితాలు పొందవచ్చు. ఇంటికి సమీపంలో పక్షుల కోసం నీళ్లు, ఆహారాన్ని పెట్టడం వలన ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం.




