జీవితంలో సమస్యలు రావడం అనేది కామన్ విషయం. సమాజంలో ప్రతీ ఒక్కరు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారం, కుటుంబంలో చికాకులు ఇలా అనేక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఈ సమస్యలన్నింటి నుంచి బయట పడేసేది ఏనుగులు బొమ్మలు.
1 / 5
వెండితో తయారు చేసిన ఏనుగు బొమ్మలను ఇంట్లో పెట్టుకుంటే అనేక సమస్యల నుంచి విముక్తి పొందుతారని వాస్తు శాస్త్రం చెబుతుంది. వెండి ఏనుగులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అనేక సమస్యల నుంచి బయట పడతారు. అన్నింటా విజయాలు కూడా సాధించవచ్చు.
2 / 5
ఎవరికి తోచినంత విధంగా వెండి ఏనుగు బొమ్మలను కొనవచ్చు. సైజుతో సంబందం లేదు. ఇంట్లో లేదా ఆఫీసులో కూడా ఈ వెండి ఏనుగు బొమ్మలను పెట్టుకోవచ్చు. ఏ దిక్కులో అయినా ఏనుగు బొమ్మలను ఉంచుకోవచ్చు.
3 / 5
అయితే ఒక్కో దిశకు వివిధ రకాల ప్రాధాన్యతలు ఉంటాయి. వెండి ఏనుగు బొమ్మలను ఇంట్లో ఉత్తరం దిక్కులో పెడితే.. అన్ని రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయట. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయట పడతారు.
4 / 5
ఆఫీసులో, వ్యాపార స్థలంలో వెండి ఏనుగులను పెట్టుకోవడం వల్ల.. ఉద్యోగాల్లో వచ్చే చికాకులు, వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. అదే ఇంట్లోని దేవుడి గదిలో వెండి ఏనుగు బొమ్మలు పెడితే.. ఆర్థిక సమస్యలు తీరి.. ఐశ్వర్య వంతులు అవుతారట.