- Telugu News Photo Gallery Cinema photos King Hero Nagarjuna Akkineni no one movie announced as a solo hero after naa saami ranga movie, Details here
Nagarjuna Akkineni: ఏమైంది నాగ్.? సోలో హీరోగా సినిమా అనౌన్స్ చేసి వన్ ఇయర్ దాటిందా.!
తోటి సీనియర్ హీరోలంతా ఒక దారిలో వెళ్తున్నపుడు.. తాను మాత్రం మరో దారిలో ఎందుకు వెళ్లడం అనుకుంటున్నారు నాగార్జున. అందుకే ఆయన కూడా తోటి నటులు వెళ్తున్న దారినే ఎంచుకున్నారు. అయినా సోలో హీరోగా సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులైపోయింది కదా..! పనిలో పనిగా అది కూడా చేయాలని చూస్తున్నారు నాగ్. మరి ఈయన నెక్ట్స్ సినిమా ఎవరితో ఉండబోతుంది.? నాగార్జున సోలో హీరోగా వచ్చి చూస్తుండగానే ఏడాది కావొస్తుంది.
Updated on: Dec 11, 2024 | 1:42 PM

తోటి సీనియర్ హీరోలంతా ఒక దారిలో వెళ్తున్నపుడు.. తాను మాత్రం మరో దారిలో ఎందుకు వెళ్లడం అనుకుంటున్నారు నాగార్జున.

అందుకే ఆయన కూడా తోటి నటులు వెళ్తున్న దారినే ఎంచుకున్నారు. అయినా సోలో హీరోగా సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులైపోయింది కదా..!

పనిలో పనిగా అది కూడా చేయాలని చూస్తున్నారు నాగ్. మరి ఈయన నెక్ట్స్ సినిమా ఎవరితో ఉండబోతుంది.? నాగార్జున సోలో హీరోగా వచ్చి చూస్తుండగానే ఏడాది కావొస్తుంది.

గత సంక్రాంతికి నా సామిరంగా అంటూ వచ్చారు నాగ్. ఆ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా ప్రకటించలేదు. చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఏది కన్ఫర్మ్ కాలేదు.

ఈ గ్యాప్‌లో సపోర్టింగ్ కారెక్టర్స్ అయితే బాగానే చేస్తున్నారు. గతేడాది బ్రహ్మాస్త్రలో చేసినట్లే.. తాజాగా 2 సినిమాలు చేస్తున్నారు. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేరా కీలక పాత్ర చేస్తున్నారు నాగార్జున.

ధనుష్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. అలాగే రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న కూలీలోనూ కీ రోల్ చేస్తున్నారు కింగ్. ఈ మధ్యలో అఖిల్, నాగ చైతన్య పెళ్లి సందడి ఉండటంతో.. సోలో హీరోగా సినిమా ప్రకటించే ఖాళీ లేకుండా పోయింది నాగార్జునకు.

సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే.. సోలో హీరోగానూ నటించడానికి సరైన స్క్రిప్ట్ కోసం చూస్తున్నారు నాగ్. ఈ క్రమంలోనే ఈయనకి ఓం భీమ్ బుష్ ఫేం హర్ష కొనగంటి చెప్పిన కథ నచ్చిందని తెలుస్తుంది.

అన్నీ కుదిర్తే నాగార్జున నెక్ట్స్ చేయబోయే సినిమా ఈ దర్శకుడితోనే. ఎలాగూ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ కూడా ఇప్పుడు కుర్ర దర్శకులతోనే పని చేస్తున్నారు.




