- Telugu News Photo Gallery Secunderabad To Tirupati Vande Bharat Express From April 8, Ticket Charges, Timings, And Stoppages May Like This
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు.. తక్కువ ధరకే విమానం లాంటి ప్రయాణం.. ఆగే స్టేషన్లు ఇవే!!
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. వచ్చే నెల 8న సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రారంభించాలని రైల్వేశాఖ భావిస్తోంది.
Updated on: Mar 30, 2023 | 10:28 AM

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. వచ్చే నెల 8న సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రారంభించాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఆ ట్రైన్ రూట్, టికెట్ ఛార్జీలు, టైమింగ్స్ తదితర అంశాలపై ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.


సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో స్టాప్‌లను కలిగి ఉంది. అయితే ఇది నగరాల మధ్య 660 కిమీ ప్రయాణాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలు మొదటిరోజు.. సికింద్రాబాద్‌లో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి 10 స్టాప్‌లలో ఆగి.. చివరి గమ్యస్థానమైన తిరుపతి రైల్వే స్టేషన్‌కి రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు 8 గంటల 30 నిమిషాల వ్యవధిలో గమ్యస్థానానికి చేరుకోనుంది. సికింద్రాబాద్ - తిరుపతి ఛైర్‌కార్ టికెట్ ధర రూ. 1680 గా నిర్ణయించారు.

ఇక ఛార్జీల విషయానికొస్తే.. వందేభారత్ రైలులో ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ధర రూ. 2వేలు పైమాట.. ఏసీ చైర్ కారు రూ. 1150గా ఉండొచ్చునని సమాచారం.. అటు సికింద్రాబాద్ టూ తిరుపతి విమాన ఛార్జీలు పరిశీలిస్తే.. దాదాపు రూ. 3500 నుంచి రూ. 6000 వరకు ఉన్న సంగతి తెలిసిందే. విమాన ఛార్జీలతో పోలిస్తే.. వందేభారత్ ధరలు చౌక అని చెప్పొచ్చు. అలాగే ఈ సర్వీసు కూడా సూపర్ హిట్ అవుతుందనే చెప్పాలి. అయితే ఈ ఛార్జీలు, ఆగే స్టేషన్లపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు మాదిరిగానే.. సికింద్రాబాద్ టూ తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలు కూడా ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుందట. ప్రస్తుతం, సికింద్రాబాద్ – త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి – తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ గుంటూరు మీదుగా తిరుపతికి పరుగులు పెడుతున్నాయి. వీటి ప్రయాణ సమయంలో దాదాపు 12 గంటలు. ఇక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాన్ని 8 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.





























