- Telugu News Photo Gallery Probiotics are yours if you eat these 7 ingredients along with yogurt Telugu Lifestyle News
Health Care: ఆరోగ్యమే మహాభాగ్యం.. పెరుగుతో పాటు ఈ 7 పదార్థాలను తింటే ప్రోబయోటిక్స్ మీ సొంతం..
శరీరానికి ప్రోబయోటిక్స్ చాలా అవసరం. ప్రోబయోటిక్స్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మంచి చేసే సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి.
Madhavi | Edited By: Shaik Madar Saheb
Updated on: Apr 20, 2023 | 9:06 AM

శరీరానికి ప్రోబయోటిక్స్ చాలా అవసరం. ప్రోబయోటిక్స్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మంచి చేసే సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి. వీటితో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చెడు బ్యాక్టీరియాను అడ్డుకోవడంలో ఎంతగానో సహాయపడతాయి. అయితే ప్రోబయోటిక్స్ అనగానే పెరుగు గుర్తుకు వస్తుంది. కేవలం పెరుగులోనే కాకుండా మరికొన్ని ఆహార పదార్థాల్లో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఆరోగ్యంతోపాటు రుచిని కూడా అందిస్తాయి. అవేంటో చూద్దాం.

మజ్జిగ: మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో మజ్జిగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఎండవేడిమిలో రిఫ్రెష్ గా ఉంచేందుకు మజ్జిగ ఎంతో సహాయపడుతుంది. పెరుగు మాత్రమే కాకుండా మజ్జిగలోనూ ప్రోబయెటిక్స్ అద్బుతమైన మూలాలు ఉన్నాయి. ఇది ప్రేగులను మంచి యాక్టివ్ గా ఉంచుతుంది.

ఊరగాయలు: ఊరగాయల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉంటాయి. మీరు ఊరగాయ ప్రియులైతే...ఊరగాయ తినడం మంచిది. ఇది ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని అదిగమించడానికి సరైన ఎంపిక. ఇందులో కూడా ప్రోబయెటిక్స్ పుష్కలంగా లభిస్తాయి.

కిమ్చి: కొరియన్ లో ఇది సాంప్రదాయక వంటకం. దీన్నికొరియన్ చాలా ఇష్టపడి తింటుంటారు. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్య ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. ముల్లంగి, లేదా క్యాబేజీతో దీన్ని తయారు చేస్తారు. ఈ డిలైట్ ఉడికించి అన్నంతో పాటుగా తింటుంటారు. ఇందులో కూడా ప్రోబయెటిక్స్ అధికంగా ఉంటాయి.

కొంబుచా: కొంబుచా అనేది ప్రోబయెటిక్స్ కు అద్భుతమైన మూలం. పులియబెట్టిన పానీయం ఇది. ఈ రుచికరమైన ఆరోగ్యకరమైన పానీయం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ ; ఇందులో కూడా అద్బుతమైన పోషకాలు ఉంటాయి. జీర్ణక్రియ, లేదా బరువు తగ్గించుకునేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.

స్విస్ చీజ్ : హార్వర్డ్ హెల్త్ ప్రకారం,ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే కొన్ని రకాల్లో స్విస్ చీజ్ కూడా ఒకటి.

కేఫీర్ : కెఫిర్ ధాన్యాన్ని ఉపయోగించి పులియబెట్టిన పాలతో తయారుచేస్తారు. ఈ పానీయంలో శక్తివంతమైన ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి పెరుగులో ఉండే వాటి కంటే బలంగా ఉంటాయి.





























