- Telugu News Photo Gallery PM Modi interacts with Delhi Metro passengers on way to attend Delhi University centenary celebrations
PM Modi: మెట్రో ట్రైన్‌లో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రయాణికులతో సరదా ముచ్చట్లు..
PM Modi interacts with Delhi Metro passengers: ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు.
Updated on: Jun 30, 2023 | 11:42 AM

PM Modi interacts with Delhi Metro passengers: ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ముగింపు ఉత్సవాల్లో మోడీ ప్రసంగించడంతోపాటు.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

అయితే, ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ.. కాన్వాయ్ లో వెళ్లకుండా సాధారణ ప్రయాణికుడిలా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు.

ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళుతూ ప్రధాని మోదీ ఢిల్లీ మెట్రోలో ఉన్న ప్రయాణికులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఎటు వెళ్తున్నారు.. ఏంటీ అంటూ వారి ఆప్యాయంగా పలకరించారు.

ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను అడగడంతోపాటు పలు విషయాల గురించి ప్రధాని మోడీ ప్రయాణికులతో ఆసక్తిగా మాట్లాడారు. స్వయంగా ప్రధాని మోడీ తమతో మాట్లాడటంతో ప్రయాణికులు హర్షం వ్యక్తంచేశారు.

2022 మే 1న ప్రారంభమైన డీయూ శతాబ్ధి ఉత్సవాలు నేటితో ముగియనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మూడు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.




