Monthly Horoscope (July 2023): 12 రాశుల వారికి జులై మాసఫలాలు.. ఉద్యోగపరంగా.. ఆర్థికపరంగా వారు వృద్ధి చెందడం పక్కా..!

July 2023 Monthly Horoscope: భవిష్యత్తులో జరగబోయేది ముందే తెలుసుకోవాలన్న ఆకాంక్ష అందరిలోనూ ఉంటుంది. దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసిస్తారు. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి జులై నెల ఎలా ఉండబోతుంది? వారి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? తెలసుకునేందుకు ఇక్కడ ఇచ్చిన మాసఫలాలను చెక్ చేసుకోండి.

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 30, 2023 | 11:36 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, శని, కుజ గ్రహాలు ఈ నెల అంతా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. ఉద్యోగ పరంగా తప్పకుండా ఒకటి రెండు శుభపరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అధికార లాభం కనిపిస్తోంది. మంచి సంస్థలోకి ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలం అవుతాయి. దీర్ఘకాలిక అనారో గ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు, స్వయం ఉపాధివారికి సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. శ్రద్ధను పెంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): బుధ శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంది. అయితే ఖర్చుల భారం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వైద్య ఖర్చులకు కూడా అవకాశం ఉంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. కొద్దిగా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు వాయిదా వేయటం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలు ఉద్యోగం లభించడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు ముందుకు దూసుకు వెళతాయి.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ నెల రాశి అధిపతి అయినటువంటి బుధ గ్రహం బాగా అనుకూలంగా ఉంది. లాభ స్థానంలో సంచరిస్తున్న గురు, రాహు గ్రహాలు కూడా శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కొందరు స్నేహితులు ఆర్థికంగా నష్టపరిచే అవకాశం ఉంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): రవి, బుధ, కుజ గ్రహాలు అనుకూలంగా ఉన్నందు వల్ల ఉద్యోగ సంబంధమైన సమస్యలు పరి ష్కారం కావడం, ఆస్తి వివాదం ఒకటి సమసి పోవటం, ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయ త్నాలు సఫలం కావడం, ఆదాయం పెరగటం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో కచ్చితంగా జాగ్రత్తలు పాటించడం మంచిది. జీవిత భాగస్వామి ఆశించిన స్థాయిలో పురోగతి చెందడం జరుగుతుంది. అష్టమ శని కారణంగా ముఖ్యమైన పనులు ఆలస్యం కావడం, కుటుం బంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తడం, అనా రోగ్యాలు ఇబ్బంది పెట్టడం వంటివి జరిగే అవ కాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్త అందు తుంది. ఒక మంచి శుభ పరిణామం చోటు చేసు కుంటుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి సాఫీగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి. సంపాదన స్థిరంగా ముందుకు సాగుతుంది. ఒకటి రెండు శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి మంచి సమాచారం అందుతుంది. సప్తమంలో శని సంచారం కారణంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో మధ్య మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరు లతో ఆచితూచి వ్యవహరించడం, అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ప్రస్తుతానికి ప్రేమలకు దూరంగా ఉండటం మంచిది.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఈ రాశి వారికి రవి, బుధ, శని గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ఒకటి రెండు ప్రయత్నాలు ఫలించి వ్యక్తిగత జీవితం పురోగతి చెందే అవకాశం ఉంది. శుభకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆదాయంలో మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో పని భారం కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఇతరుల విషయాలలో తల దూర్చవద్దు. ఉద్యోగులు ఒక చిన్న ఉద్యోగంతో సంతృప్తి చెందవలసి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలలో ఇబ్బందులు ఏర్పడతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): గురు, శని, శుక్ర, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి జులైలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రతి చిన్న ప్రయత్నం భారీ స్థాయిలో ప్రయోజనా లను కలిగించే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార లాభం ఉంది. మంచి సంస్థలోకి ఉద్యోగం మారేందుకు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): రవి బుధ గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతుంది. ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు యధావిధిగా కొనసాగుతాయి. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో లేదా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినప్పటికీ, అది తప్పకుండా సఫలం అవుతుంది. శని గురు బుధ రవి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రభుత్వ సంబంధ మైన పనులు పూర్తి కావడం, ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడం, ప్రభుత్వ ఉద్యోగుల సంపా దన పెరగటం వంటివి తప్పకుండా జరుగు తాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు ఆశించిన స్థాయిలో శుభ ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులు మంచి సంస్థలో చేరే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశి వారికి ఈ నెల అంతా గురు బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల శుభవార్త శ్రవణానికి అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా ఆర్థికపరంగా ఒకటి రెండు శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. ఒక శుభ పరిణామం చోటు చేసుకుం టుంది. దీనివల్ల జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ ప్రోత్సాహం లభి స్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో సంపాదన పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశి వారికి ప్రస్తుతం బుధ, శుక్ర గ్రహాలు కొద్దిగా అనుకూలంగా ఉన్నందువల్ల కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం సాఫీగా సాగిపోవడా నికి అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాలలో పని భారం ఎక్కువగా ఉంటుంది. అలవి కాని లక్ష్యాలతో అవస్థలు పడటం జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కొం టారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. స్నేహితులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు అవకాశం ఉంది.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): గురువు, బుధుడు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి ఆర్థికంగా మానసికంగా బాగుండే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. డబ్బు ఇవ్వాల్సిన వారు తిరిగి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. మానసిక ప్రశాం తత ఏర్పాటు అవుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. కుటుం బానికి సంబంధించి శుభవార్తలు వినడం జరుగు తుంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సుఖసంతోషాలతో సాగిపోతాయి.

12 / 12
Follow us