- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti for happy love life these things partner should do for happiness in telugu
Chanakya Niti: మీ జీవితం ప్రేమ, సంతోషాలతో నిండిపోవాలా .. చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి
గొప్ప ఆర్థికవేత్త ఆచార్య చాణక్య తన చాణక్య నీతి పుస్తకంలో సంతోషకరమైన జీవితానికి సంబంధించిన అనేక రహస్యాలను పంచుకున్నారు. ఇందులో జీవితాన్ని సంతోషంగా ప్రేమగా గడిపేందుకు భాగస్వామి చేయాల్సిన , పాటించాల్సిన రహస్యం కూడా ఉంది. చాణక్యుడు ప్రకారం భాగస్వామి చేయాల్సిన పనుల గురించి తెలుసుకుందాం..
Updated on: Jun 29, 2023 | 2:13 PM

గౌరవం ఇవ్వడం: సంబంధంలో పరస్పర గౌరవం చాలా ముఖ్యం అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఎవరైతే తమ ప్రియురాలిని లేదా భార్యను గౌరవిస్తారో, వారికి కూడా తిరిగి గౌరవం లభిస్తుంది. వారి జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. సంబంధాన్ని కొనసాగించడానికి ఒకరి భాగాలకు ఒకరు, వ్యక్తిత్వ గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

ఒక వ్యక్తి లక్ష్యాన్ని సాధించడానికి చాలాసార్లు వైఫల్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే వైఫల్యాలు ఎదురైనప్పుడు భయపడవద్దని సూచించారు. విజయాన్ని సాధించే సమయంలో అభ్యసన ప్రక్రియలో అపజయం కూడా ఒక భాగమని, జీవితంలో సరైన లక్ష్యాన్ని పెట్టుకుని దాని కోసం కృషి చేయాలని చెప్పాడు చాణక్య.

సోమరితనంతో చేయాల్సిన పనులను తరచుగా వాయిదా వేస్తారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని చాణక్యుడు సూచించాడు. విజయం సాధించాలంటే సోమరితనం విడనాడాలని అన్నారు. సోమరితనం ఉన్నవారికి విజయం ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పాడు. ఇంకా ఎవరికైనా సోమరితనాన్ని గొప్ప శత్రువుగా ఎత్తి చూపాడు.

బ్యాలెన్స్‌గా నిలబడే నేచర్: బ్యాలెన్స్ లేకుండా ఏ సంబంధమూ నడవదు. ఆచార్య చాణక్యుడు రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయడంపై అత్యంత ముఖ్యమని ఉద్ఘాటించారు. భాగస్వాముల మధ్య సమతూకం ఉండాలని.. బ్యాలెన్స్‌ని మెయింటెయిన్ చేసినప్పుడే బాంధవ్యం సక్రమంగా కొనసాగుతుందని చెప్పారు.

సహనం, క్షమాపణ: ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సహనంతో ఉండాలని.. క్షమించే గుణం కలిగి ఉండాలని చాణక్యుడు చెప్పాడు. ఏదైనా పొరపాటు జరిగితే దానిని ఎప్పుడూ గుర్తు పెట్టుకుని ఎత్తి చూపకుండా.. అందుకు బదులు క్షమించి ముందుకు సాగాలి. సమస్యలను పరస్పరం మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి.




