- Telugu News Photo Gallery Photos of MV Ganga Vilas which will be flagged off by PM Modi on 13th January
MV Ganga Vilas: రెండు దేశాలు.. రెండు మహానదులు.. విలాసవంతమైన నౌకాయానం.. ఫొటోలు చూస్తే వావ్ అనాల్సిందే..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన లగ్జరీ క్రూయిజ్ గంగా విలాస్‌ను జనవరి 13న ప్రారంభించనున్నారు. ఈ లగ్జరీ క్రూయిజ్ భారతదేశం, బంగ్లాదేశ్‌లోని ఐదు రాష్ట్రాలలో రెండు మహానదులపై 27 నదీ వ్యవస్థలపై 3,200 కి.మీ. మేర ప్రయాణించనుంది.
Updated on: Jan 11, 2023 | 9:26 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన లగ్జరీ క్రూయిజ్ గంగా విలాస్‌ను జనవరి 13న ప్రారంభించనున్నారు. ఈ లగ్జరీ క్రూయిజ్ భారతదేశం, బంగ్లాదేశ్‌లోని ఐదు రాష్ట్రాలలో రెండు మహానదులపై 27 నదీ వ్యవస్థలపై 3,200 కి.మీ. మేర ప్రయాణించనుంది. గంగా విలాస్ వారణాసి నుంచి ప్రారంభమై 51 రోజుల్లో దిబ్రూఘర్ చేరుకుంటుంది.

గంగ, బ్రహ్మపుత్ర మహానదుల్లో విలాసవంతమైన నౌకాయానానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ షిప్ టూరిజం ఇదేకానుంది. ఈ లగ్జరీ క్రూయిజ్ భారతదేశం, బంగ్లాదేశ్‌లోని ఐదు రాష్ట్రాలలో రెండు మహానదులపై 3,200 కి.మీ. ప్రయాణించనుంది.

మొదటి ట్రిప్‌లో స్విట్జర్లాండ్ కు చెందిన 32 మంది పర్యాటకులు వారణాసి నుంచి దిబ్రూగఢ్‌కు ఎంవీ గంగా విలాస్‌లో ప్రయాణించనున్నారు. వారణాసి నుంచి 13న ప్రారంభమవుతున్న క్రూయిజ్ ప్రయాణం.. 51 రోజుల తర్వాత మార్చి 1 2023న అస్సాంలోని దిబ్రూఘర్‌లో ముగుస్తుంది.

51 రోజుల ప్రయాణంలో ఈ క్రూయిజ్ భారత్, బంగ్లాలోని వారసత్వ ప్రదేశాలు, జాతీయ పార్కులు, నదీ ఘాట్‌ల గుండా ప్రయాణిస్తుంది. వారణాసిలోని ప్రసిద్ధ గంగా ఆరతి నుంచి వారసత్వ ప్రదేశాలు, కాజిరంగా నేషనల్ పార్క్, సుందర్బన్స్ డెల్టా వంటి అభయారణ్యాలతో సహా 50 ప్రధాన పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంది. క్రూయిజ్ బంగ్లాదేశ్‌లో సుమారు 1,100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

మనదేశంలో బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, అస్సాంలోని గౌహతి, బంగ్లాదేశ్‌లోని ఢాకా, ఇతర ప్రాంతాలతో సహా మొత్తం 50 పర్యాటక ప్రాంతాలను సందర్శించనుంది.

క్రూయిజ్ లో పర్యాటకుల కోసం అన్ని సౌకర్యాలు, భద్రతా ప్రోటోకాల్‌ను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు. దేశంలో క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది.





























