- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna got her first hit in Tamil with Varisu movie telugu cinema news
Rashmika Mandanna: తమిళంలో తొలి హిట్ అందుకున్న రష్మిక మందన్నా.. వారిసు బ్లాక్ బస్టర్..
కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు తెరకు పరిచమయైన ముద్దుగుమ్మలలో రష్మిక మందన్నా ఒకరు. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు వరుస హిట్స్ అందుకుంటుంది.
Updated on: Jan 11, 2023 | 9:24 PM

కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు తెరకు పరిచమయైన ముద్దుగుమ్మలలో రష్మిక మందన్నా ఒకరు. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు వరుస హిట్స్ అందుకుంటుంది.

యంగ్ హీరో నాగశౌర్య నటించిన ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి గీతా గోవిందం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ హోదాను అందుకుంది. దాంతో ఈ ముద్దుగుమ్మకు భారీ ఆఫర్లు క్యూ కట్టాయి.

ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది రష్మిక. దీంతో తెలుగుతోపాటు.. హిందీలోనూ వరుస ఆఫర్లు అందుకుంది.

ఇక తమిళనాట హీరో కార్తీ సరసన సుల్తాన్ సినిమాతో పరిచయమైంది. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టులేకపోయిన రష్మిక నటనకు.. అందానికి మంచి మార్కులు పడ్డాయి.

తాజాగా విజయ్ దళపతి సరసన వారిసు సినిమాతో మరోసారి తమిళ ప్రేక్షకులను అలరించింది. నేడు విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో తొలిసారి తమిళంలో హిట్ రుచి చూసింది రష్మిక.

తమిళంలో తొలి హిట్ అందుకున్న రష్మిక మందన్నా.. వరిసు బ్లాక్ బస్టర్..




