- Telugu News Photo Gallery Onion Juice For Dandruff: Onion juice for healthy, long hair and get rid of dandruff
Onion Juice for Hairs: కురుల పోషణకు ఉల్లి రసం.. ఇలా వాడారంటే ఒత్తైన పొడవాటి జుట్టు మీ సొంతం
వంటకాలకు రుచిని అందించే ఉల్లి జుట్టు సమస్యలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఉల్లిలోని సల్ఫర్ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉల్లి జుట్టు సంబంధిత సమస్యలను నయం చేసి, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జుట్టు రాలడం, చుండ్రు సమస్యల ఉల్లి రసం బలేగా ఉపయోగపడుతుంది. ఉల్లి నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల..
Updated on: Feb 03, 2025 | 4:58 PM

ఉల్లిపాయలు వంటకాల రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. అందుకే వీటిని ఏ వంటకంలోనైనా ఉపయోగిస్తారు. అయితే ఉల్లి అందానికి కూడా మెరుగులు దిద్దుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉల్లిపాయల్లో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉల్లి జుట్టు సంబంధిత సమస్యలను నయం చేసి, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

జుట్టు రాలడం లేదా చుండ్రు సమస్యలతో బాధపడుతుంటే ఉల్లి రసం ఉపయోగించవచ్చు. జుట్టు రాలే సమస్యల నుంచి బయటపడేందుకు ఉల్లిపాయ నూనెను అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఉల్లి నూనెను ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది. జుట్టు చిట్లిపోయి పొడిగా ఉన్నట్లయితే ఉల్లి నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.

ఉల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చుండ్రును నయం చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టుకు ఉల్లి రసాన్ని అప్లై చేయడం వల్ల జుట్టు మరింత మెరుస్తూ, మృదువుగా మారుతుంది. షాంపూ చేయడానికి ముందు ఉల్లి రసాన్ని జుట్టుకు అప్లై చేస్తే.. తలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టును ఒత్తుగా మార్చడంలో సహాయపడుతుంది.

చిన్న వయస్సులో నల్లని జుట్టు తెల్లబడితే జుట్టుకు ఉల్లి రసాన్ని అప్లై చేయడం మంచిది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడతాయి. ఇంట్లోనే ఉల్లి నూనెను ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

ముందుగా ఉల్లిపాయను మిక్సీలో వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి. యాలి. ఈ పేస్ట్‌ను గుడ్డ ద్వారా వడకట్టి, రసాన్ని వేరుచేయాలి. దీనిలో కొబ్బరి నూనెతో కలిపి 15-20 నిమిషాలు బాగా మరిగించాలి. నూనె చల్లారిన తర్వాత జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఉల్లి నూనె జుట్టు మందంగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. ఉల్లి నూనెను వారానికి ఒకటి లేదా రెండు సార్లు మసాజ్ చేయడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. తల స్నానానికి ముందు ఉల్లి నూనె అప్లై చేసి 1-2 గంటలు వదిలి, ఆపై షాంపూతో కడిగేయాలి. ఆయిల్ స్కాల్ప్ ఉన్నవారు ఉల్లి నూనె ఉపయోగించకపోవడమే మంచిది.





























