- Telugu News Photo Gallery Cricket photos WTC 2023 25: 4 Day Tests and Major Rule Changes in test format beore ind vs eng test series
Test Format: ఇకపై 4 రోజుల టెస్ట్‌లే.. వన్డే, టీ20 రూల్స్‌తో మరింత మజా.. భారత్, ఇంగ్లండ్ సిరీస్‌తోనే మొదలు?
4 Day Test Cricket Changes: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 సీజన్ తర్వాత, కీలక మార్పులు జరగనున్నాయి. నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు, కొత్త ఫార్మాట్‌లు చర్చనీయాంశంగా ఉన్నాయి. ఐదు రోజుల టెస్టులు యాషెస్ వంటి ప్రధాన సిరీస్‌లకు మాత్రమే పరిమితం కావొచ్చు అని తెలుస్తోంది. ఈ మార్పులు టెస్ట్ క్రికెట్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చే అవకాశం ఉందని అంటున్నారు.
Updated on: Feb 03, 2025 | 5:00 PM

World Test Championship Future: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 చివరి దశలో ఉంది. జూన్ 11న ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. అయితే, దీనికి ముందు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కొత్త సీజన్ కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడం ప్రారంభించింది.

వన్డే, టీ20 లాంటి ఉత్కంఠ ఇప్పుడు టెస్టు క్రికెట్‌లోనూ కనిపిస్తోంది. ఒక నివేదిక ప్రకారం, టెస్ట్ క్రికెట్‌లో కీలక మార్పును చూడొచ్చు. దీని కారణంగా తదుపరి సీజన్ ఉత్కంఠ గరిష్టంగా ఉంటుంది. పూర్తి 5 రోజుల పాటు టెస్ట్ మ్యాచ్ జరగదని తెలుస్తోంది.

ఈసీబీ అధ్యక్షుడు జైషాతో భేటీ: ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, జులైలో కొనసాగుతున్న సైకిల్ ముగిసిన తర్వాత, భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో కీలక మార్పులు చేయబోతున్నారు. నివేదిక ప్రకారం, ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ ఈ చొరవను తీసుకున్నారని తెలుస్తోంది. ఛాంపియన్‌షిప్ భవిష్యత్తుపై చర్చించేందుకు థాంప్సన్ ఇటీవల ఐసీసీ అధ్యక్షుడు జై షాను కలిశారు. తదుపరి సీజన్ జూన్ 20న హెడ్డింగ్లీలో జరిగే ఇంగ్లండ్-భారత్ టెస్ట్‌తో ప్రారంభమవుతుంది. దానికంటే ముందే పలు కీలక నిర్ణయాలు ఖరారు చేయవచ్చు అని తెలుస్తోంది.

థాంప్సన్ ఏం చెప్పాడంటే? థాంప్సన్ మాట్లాడుతూ, 'ప్రస్తుత రూల్స్ సరిగ్గా పనిచేయడం లేదని పూర్తిగా అర్థమైంది. మేం మెరుగైన పోటీని కనుగొనాలని చూస్తున్నాం. కానీ, ఈ దశలో ఎటువంటి సిఫార్సులు వెలువడలేదు. దీనిపై ఐదు నెలల సమయం ఉంది. వెనక్కి తగ్గడమా, లేదా ఏదైనా కీలక మార్పులు చోటు చేసుకుంటాయో లేదో చూడాలి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మరింత సమర్ధవంతంగా, మరింత పోటీగా ఉండాలి. అత్యుత్తమ జట్లను ఫైనల్స్‌కు చేరుకోవడానికి ఇది ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. టెస్ట్ క్రికెట్ ఆడాలనుకునే ఇతర దేశాలను టెస్ట్ క్రికెట్ ఆడేలా ప్రోత్సహించేలా ఇది మారబోతోంది. మేం టెస్ట్ క్రికెట్ సమగ్రతను రక్షిస్తాం, మెరుగుపరుస్తాం. ఎందుకంటే, ఈ ఫార్మాట్ క్రికెట్ ఆట DNA కి చాలా ముఖ్యమైనది' అంటూ చెప్పుకొచ్చాడు.

ఐదు రోజుల పాటు టెస్ట్ క్రికెట్ జరగదా? హిందూస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, నాలుగు రోజుల టెస్ట్ సాధ్యాసాధ్యాలను కూడా చర్చలో చర్చించే అవకాశం ఉంది. అలాగే, మూడు టెస్టుల సిరీస్‌ను అనుమతించవచ్చు అని తెలుస్తోంది. అయితే, నివేదిక ప్రకారం, యాషెస్ వంటి మార్క్యూ సిరీస్, ఇతర టైర్-వన్ పోటీలు ఐదు రోజుల మ్యాచ్‌లు జరుగుతాయని అంటున్నారు. ఈ ప్రణాళిక అమలు చేస్తే, భారతదేశం టైర్-వన్ జట్లలో చేరే అవకాశం ఉంటుంది. అంటే భారత జట్టు నాలుగు రోజుల టెస్టు ఆడే అవకాశం లేదు.





























