- Telugu News Photo Gallery Cricket photos Abhishek Sharma to Tilak Varma including 3 Indian young players may score double century in t20 international cricket
Team India: టీ20ఐల్లో డబుల్ సెంచరీల వర్షం.. లిస్ట్‌లో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు?
Double Century in T20 International Cricket: టీ20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించడం ఒక కష్టతరమైన పని అయినప్పటికీ, యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ భారతీయ బ్యాట్స్‌మెన్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో ఈ రికార్డును సాధించే అవకాశం ఉందని చూపుతున్నారు. వీరి అద్భుతమైన స్కోర్లు మరియు ఆటతీరు ఈ రికార్డును సాధించడానికి వీరు దగ్గరగా ఉన్నారని సూచిస్తున్నాయి.
Updated on: Feb 03, 2025 | 6:18 PM

Double Century in T20I Format: టీ20 క్రికెట్‌లో సెంచరీ సాధించడం ఒక సవాలు. ఇప్పటికే కొందరు ఆటగాళ్లు సెంచరీలు సాధించి, పొట్టి ఫార్మాట్‌లోనూ ఈజీగా సెంచరీలు సాధించొచ్చని చూపిస్తున్నారు. ముఖ్యంగా భారత క్రికెట్‌లో ముగ్గురు యువ ఆటగాళ్ళు ఈ ఫార్మాట్‌లో ప్రావీణ్యం సంపాదించినట్లు కనిపిస్తోంది. వీరికి సెంచరీ సాధించడం అనేది వెన్నతో పెట్టిన విద్యలా మారింది. 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ల బ్యాటింగ్ ఎంత ప్రాణాంతకంగా ఉందంటే, ఈ బ్యాట్స్‌మెన్స్ టీ20లో డబుల్ సెంచరీ సాధించడానికి ఎంతో దూరంలో లేరని అనిపిస్తుంది. ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ల గణాంకాలే ఇందుకు నిదర్శనం.

ఇప్పటివరకు ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మన్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ స్థానాన్ని సాధించలేకపోయాడు. 2018లో జింబాబ్వేపై 172 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ టీ20లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. కానీ, ఈ రికార్డు 2 ఫిబ్రవరి 2025న తృటిలో సేవ్ అయింది.

1. యశస్వి జైస్వాల్: టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వయసు 23 ఏళ్లు మాత్రమే. అయితే, టీ20, టెస్టు ఫార్మాట్లలో తన బ్యాటింగ్‌తో అగ్రశ్రేణి జట్లకు కూడా భయం పుట్టించాడు. జైస్వాల్ ఇప్పటివరకు టీమ్ ఇండియా తరపున 23 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతని పేరు మీద ఒక సెంచరీ ఉంది. అదే సమయంలో, జైస్వాల్ కూడా 84, 93 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌లతో సహా 5 అర్ధసెంచరీలు చేశాడు. జైస్వాల్ స్టైల్ ఎంత ప్రాణాంతకం అంటే భవిష్యత్తులో ఈ ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ కూడా సాధించగలడు అని తెలుస్తోంది.

2. అభిషేక్ శర్మ: యువరాజ్ సింగ్ శిష్యుడు అభిషేక్ శర్మ పొట్టి ఫార్మాట్‌లో డేంజరస్ ప్లేయర్‌గా మారాడు. తుఫాన్ ఆటతో ఈజీగా సెంచరీలు బాదేస్తున్నాడు. ఫిబ్రవరి 2న 24 ఏళ్ల అభిషేక్ శర్మ ఇంగ్లండ్‌పై విధ్వంసం సృష్టించాడు. అతను కేవలం 54 బంతుల్లో 135 పరుగుల భయంకరమైన ఇన్నింగ్స్‌తో దడ పుట్టించాడు. ఈ క్రమంలో అభిషేక్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. టీ20లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. 4 ఓవర్లు మిగిలి ఉండగానే అనుకోకుండా అభిషేక్ వికెట్ కోల్పోయాడు. లేకుంటే డబుల్ సెంచరీ సాధించడం పెద్ద విషయం కాదు. అభిషేక్ 17 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, హాఫ్ సెంచరీలు అతని పేరిట ఉన్నాయి.

3. తిలక్ వర్మ: ఈ జాబితాలో కేవలం 22 ఏళ్ల వయసున్న తిలక్ వర్మ కూడా చేరిపోయాడు. దక్షిణాఫ్రికా టూర్‌లో సెంచరీ సాధించడం ద్వారా భారత్ వెలుపల సంచలనం సృష్టించాడు. తిలక్ కేవలం 25 టీ20 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు సాధించాడు. దేశంలో అయినా, విదేశాల్లో అయినా తిలక్ వర్మ బ్యాట్‌తో సందడి చేస్తూనే ఉంటారు. ఇటువంటి పరిస్థితిలో, అతను టీ20లో డబుల్ సెంచరీ సాధించడాన్ని సవాలుగా స్వీకరించే సత్తా కూడా ఉంది.





























