- Telugu News Photo Gallery Cricket photos Champions Trophy 2025 Countdown: India vs Pak Match Tickets Prices Details check here
IND vs PAK: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా మ్యాచ్‌లకు టిక్కెట్ల విక్రయాలు.. రేట్స్ ఎలా ఉన్నాయంటే?
Champions Trophy 2025 India Match Schedule Tickets: 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి రెండు వారాలే మిగిలి ఉన్నాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. దుబాయ్‌లో జరిగే భారత్ మ్యాచ్‌ల టిక్కెట్లు ఫిబ్రవరి 3 నుంచి అందుబాటులో ఉంటాయి. పాకిస్థాన్‌లోని మ్యాచ్‌ల టిక్కెట్లు గత వారం నుంచి అందుబాటులో ఉన్నాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ ధర సుమారు 3000 రూపాయలుగా మొదలుకానుందంట.
Updated on: Feb 03, 2025 | 4:22 PM

Champions Trophy 2025 Tickets India Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మెగా టోర్నీ ప్రారంభానికి కేవలం 2 వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరోవైపు దుబాయ్ వెళ్లి టీమ్ ఇండియా మ్యాచ్‌లను ఆస్వాదించాలనుకునే అభిమానుల నిరీక్షణకు ఐసీసీ తెరపడింది. భారత్ మ్యాచ్‌ల టిక్కెట్ విక్రయాలు ప్రారంభమయ్యాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కాగా, టీమిండియా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. చాంపియన్స్ ట్రోఫీలో హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ హై ఓల్టేజీ మ్యాచ్ అంటే భారత్ వర్సెస్ పాక్ జట్ల మధ్య జరిగే టిక్కెట్‌ల విక్రయాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ప్రారంభించింది. ఎలా కొనుగోలు చేయవచ్చు, దాని ధర ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

గత వారం పాకిస్థాన్‌లో విక్రయాలు: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. భారత్ తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. మిగిలిన జట్లు పాకిస్తాన్‌లో ఆడతాయి. పాకిస్థాన్‌లో జరగనున్న మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయం గత వారంలోనే ప్రారంభమైంది. ఇందుకోసం ఆఫ్‌లైన్ సదుపాయాన్ని కూడా అప్‌డేట్ చేశారు. ఫిబ్రవరి 3వ తేదీ పాకిస్తాన్ కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల నుంచి అభిమానులు పాకిస్తాన్‌లో మ్యాచ్‌ల కోసం ఆఫ్‌లైన్ టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు. 26 నగరాల్లోని టీసీఎస్ కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

ఐసీసీ అప్‌డేట్ ఏమిటి? ఫిబ్రవరి 3వ తేదీన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటల నుంచి దుబాయ్‌లో జరగనున్న మ్యాచ్‌ల టిక్కెట్లు విక్రయానికి అందుబాటులో ఉంటాయని ఐసీసీ సోమవారం తన అప్‌డేట్‌లో తెలిపింది. మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్‌లో జరుగుతుంది. ఇందుకోసం ఐసీసీ మొదటి సెమీ-ఫైనల్ ముగిసిన తర్వాత ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ ధర విక్రయానికి అందుబాటులో ఉంటుందని తెలియజేసింది.

ఇండియా మ్యాచ్‌ల ప్రైజ్ మనీ ఎంత? భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే హైవోల్టేజీ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 23న ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో మైదానం కిక్కిరిసిపోతుందనడంలో సందేహం లేదు. ఐసీసీ అప్‌డేట్ ప్రకారం, సౌదీ అరేబియా కరెన్సీలో చౌకైన టికెట్ ధర 125 దిర్హామ్‌లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు 3 వేల రూపాయలుగా ఉందంట.





























