వర్షాకాలం వచ్చేసింది.. పాములంటే భయమా.. ఈ వస్తువుల వాసనతో పాములు పలాయన మంత్రాన్ని పటిస్తాయి
వర్షాకాలం వచ్చేసింది. దీంతో వేసవి నుంచి ఉపశమనంతో పాటు ప్రకృతి పులకరిస్తుంది. ఋతుపవనాల రాకతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదే సమయంలో పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా ఇంటి ఆవరణలో , పోల్లాల్లో, వీధుల్లో , పొదల్లో పాములు కనిపిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తాయి. అయితే ఇలా కనిపించే పాములను చంపకుండా వాటిని తరిమికొట్టడానికి కొన్ని సాధారణ ఇంటి చిట్కాలు ఉన్నాయని కొంతమందికి మాత్రమే తెలుసు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పాములు భయంతో ఎదుటివారిపై దాడి చేస్తాయి. కనుక పాములను ఇంటి చుట్టుపక్కల నుండి కొన్ని సింపుల్ చిట్కాలతో సులభంగా తరిమికొట్టవచ్చు.
Updated on: Jun 18, 2024 | 8:57 PM

వర్షాకాలంలో విషసర్పాల బెడద ఎక్కువగా ఉంటుంది. హిందూమతంలో పాములను దేవతలగా భావించి పూజిస్తారు. నాగదేవతను ప్రత్యేక పర్వదినాల్లో పూజించే ఆచారం నేటికీ కొనసాగుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటుతో ఏటా చాలా మంది చనిపోతున్నారు.

పాము పేరు వింటేనే చాలా మందికి వణుకు పుడుతుంది. చాలా మంది భయంతో పాముల చిత్రాలను కూడా చూడరు. చాలా మంది పాముల భయాన్ని పోగొట్టుకోవడానికి తాయెత్తులను కూడా ధరిస్తారు లేదా మంత్రాలు వేస్తారు. ఇంట్లో ఎక్కడైనా పాము బయటకు వస్తే భయపడి.. భయాందోళనకు గురై పామును చంపేందుకు కూడా వెనుకాడరు.

అయితే కొంతమంది పాములను చంపడం మహాపాపమని భావిస్తారు. ఈ నేపధ్యంలో వీటిని చంపకుండా తరిమికొట్టడానికి కొన్ని సాధారణ ఇంటి చిట్కాలున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాములు భయంతో దాడి చేస్తాయి. ఫలితంగా పాముని ఇబ్బంది పెట్టకుండా ఉండటం మంచిది. పాములను ఇంటి చుట్టుపక్కల నుంచి సులభంగా తరిమికొట్టాలంటే ఇంట్లోని ఉండే కొన్ని వస్తువులు చాలు అని.. అవి అందరికీ అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.

విషపూరితమైన పాములు సాధారణంగా కొండలు, గ్రామీణ ప్రాంతాల్లో గుట్టలు లేదా చెరువులు, పార్కులు మొదలైన వాటికి సమీపంలో ఉన్న పాత ఇళ్లలో కనిపిస్తాయి. వర్షాకాలంలో ఆహారాన్ని వెతుక్కుంటూ పాములు ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తాయి. కనుక వర్షాకాలానికి ముందు, ప్రత్యేకమైన వాసన ఉన్న వస్తువులను చేతిలో ఉంచుకోండి. వీటి వాసన విషపూరిత పాములు పారిపోయేలా చేస్తుంది.

ప్రతి ఇంట్లో వెల్లుల్లి, ఉల్లి నిల్వ ఉంటుంది. వెల్లుల్లి, ఉల్లిపాయల వాసనను పాములు తట్టుకోలేవని చాలా మందికి తెలియదు. ఈ సమయంలో పాములను తరిమికొట్టడానికి కార్బోలిక్ యాసిడ్ ఉపయోగించబడుతుంది. ఈ యాసిడ్ పాములను కూడా చంపగలదు. ఈ రసాయనాలు పాములను అనారోగ్యాన్ని కలిగిస్తాయి.

అంతేకాకుండా పుదీనా, తులసి ఆకుల వాసనను పాములు తట్టుకోలేవు. తులసి ఆకులను చాలా సంవత్సరాలుగా పవిత్రమైనవిగా పూజిస్తున్నారు. తులసి ఆకులకు కొరత ఉండదు. ఇంకా ఉన్నాయి. ఒక వెబ్‌సైట్ ప్రకారం పాములను తరిమికొట్టడానికి ఘాటైన వాసన ఉండే వస్తువులు చాలు. వీటి ద్వారా పాములను తరిమి కొడితే పర్యావరణ వ్యవస్థ సాధారణంగా ఉంటుంది.

అంతే కాకుండా నిమ్మరసం, వెనిగర్, దాల్చిన చెక్క నూనె కలిపి స్ప్రే చేస్తే పాములు అమ్మోనియా వాయువు వాసనను తట్టుకోలేవు. అమ్మోనియా వాసన వస్తే చాలు వెంటనే పలాయన మంత్రాన్ని పటిస్తాయి.

పాములు కూడా శబ్దానికి చాలా భయపడతాయి. ఒక అధ్యయనం ప్రకారం పాములు వినికిడి ద్వారా మాత్రమే ఆహారాన్ని కనుగొంటాయి. కిరోసిన్ వాసనను పాములు కూడా తట్టుకోలేవు.





























