- Telugu News Photo Gallery Cricket photos West Indies Player Nicholas Pooran Breaks Chris Gayle Record in T20 World Cup 2024
T20 World Cup: బాబోయ్.. ఇదేం బీభత్సం భయ్యా.. మూలనపడ్డ రికార్డులకే మడతెట్టేశావ్..
Nicholas Pooran Breaks Chris Gayle Record: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నికోలస్ పూరన్ తుఫాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో 53 బంతులు ఎదుర్కొన్న పూరన్ 8 భారీ సిక్సర్లతో 98 పరుగులు చేసి సెంచరీకి దూరమయ్యాడు. అయితే, ఈ 98 పరుగులతో పూరన్ రెండు భారీ రికార్డులను లిఖించగలిగాడు.
Updated on: Jun 18, 2024 | 8:20 PM

Nicholas Pooran Breaks Chris Gayle Record: టీ20 ప్రపంచ కప్ 40వ మ్యాచ్‌లో, నికోలస్ పూరన్ తుఫాన్ బ్యాటింగ్ ప్రదర్శనతో అనేక రికార్డులను సృష్టించాడు. ముఖ్యంగా రికార్డుల చీఫ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రెండు రికార్డులను పూరన్ బ్రేక్ చేసేశాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చిన నికోలస్ పూరన్ 53 బంతుల్లో 8 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో 98 పరుగులు చేశాడు. ఈ ఎనిమిది సిక్సర్లతో పూరన్ వెస్టిండీస్ సిక్సర్ లీడర్‌గా నిలిచాడు.

గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది. వెస్టిండీస్ తరుపున 79 టీ20 మ్యాచ్‌లు ఆడిన యూనివర్స్ బాస్‌గా పేరొందిన గేల్.. మొత్తం 124 సిక్సర్లు కొట్టి ఈ రికార్డును లిఖించాడు. ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టడంలో పూరన్ సక్సెస్ అయ్యాడు.

వెస్టిండీస్ తరపున 92 టీ20 మ్యాచ్‌లు ఆడిన నికోలస్ పూరన్ మొత్తం 128 సిక్సర్లు కొట్టాడు. దీంతో టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.

అలాగే, ఈ మ్యాచ్‌లో 98 పరుగులు చేయడంతో, వెస్టిండీస్ తరపున టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా పూరన్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ గేల్ పేరిట ఉండేది.

క్రిస్ గేల్ 79 టీ20 మ్యాచ్‌లు ఆడి మొత్తం 1899 పరుగులు చేశాడు. ఇప్పుడు నికోలస్ పూరన్ 84 టీ20 ఇన్నింగ్స్‌ల నుంచి మొత్తం 2012 పరుగులు సాధించాడు. దీంతో వెస్టిండీస్ తరపున టీ20 క్రికెట్‌లో 2000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.




