- Telugu News Photo Gallery Cinema photos Naga Chaitanya Green Signal To His 25th Movie With New Director
Naga Chaitanya: తండేల్‌తో చై జోరు.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే..
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం జోరు మీదున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చైతూ.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేశాడు. మరోవైపు చైతూ చేయబోయే కొత్త ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి. తాజాగా నాగచైతన్య చేతిలో రెండు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు చైతూ కొత్త సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతుంది.
Updated on: Apr 02, 2025 | 2:21 PM

తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటించింది.

ఈ సినిమాతో నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు చైతూ. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆయన విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండుతో కలిసి ఓ మైథికల్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్య షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

ఏప్రిల్ రెండో వారంలో హైదరాబాద్ లో ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ క్రమంలోనే చైతూ ఇప్పుడు తన 25వ సినిమా పై ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. కిశోర్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చిందని సమాచారం.

ఆ కథలో తన పాత్ర కూడా వైవిధ్యభరితంగా ఉండడంతో సినిమా చేసేందుకు చైతూ సిద్ధమవుతున్నాడని.. ఈ మూవీకి సంబంధించ నిర్మాణ వ్యవహారాలన్నీ ఓ కొలిక్కి వచ్చాకా ఈ ప్రాజెక్ట్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారని టాక్. ఇక ఇందులో నటించే హీరోయిన్





























